Monday, June 17, 2024

షారూక్‌ తో సందీప్‌కి గొడవా?

బాలీవుడ్‌ బాద్‌షా… షారుక్ ఖాన్ క్రేజీ డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగా మధ్య మాటల యుద్దం స్టార్ట్ అయింది. ఇంతకీ వీరిద్దరి మధ్య యుద్ధమేంటబ్బా అనుకుంటున్నారా? అసలు కారణం ఏమయి ఉంటది అని తలలు బద్దలుకొట్టుకోకండి.. ఇటీవలె సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో? అంతకు మించి పాత్రల పరంగా నెగిటివిటీని తెచ్చి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పాత్రలన్నింటిని చాలా మంది క్రిటిక్స్‌ విమర్శించారు.

అయితే 900 కోట్లు వసూళ్లు తెచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా కావడంతో ఆ విమర్శలేవీ కూడా పట్టించుకోవడం లేదు. ఈమధ్యే షారుక్ ఖాన్ కూడా విలన్ పాత్రలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘ఎంతో ఆశాజనకంగా..సంతోషంగా ఉండే కథల్నే ఎంచుకుంటాను. ఇక నా సినిమాలో హీరో పాత్ర మంచి పనులే చేస్తుంది. అలాగే ఎంతో మందికి ఆదర్శంగా ఉంటుంది. ఎప్పటికైనా చెడుపైన మంచే గెలుస్తుంది’ అన్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై సందీప్ రెడ్డి అంతే ధీటుగా స్పందించినట్లు సమాచారం

హీరో పేరు పెట్టకుండా అతడిపై తనదైన శైలిలో స్పందించాడు సందీప్ రెడ్డి. ‘కొంత మందికి అసలు హీరో అంటే అర్ధం ఏంటో తెలియడం లేదు. ఆదర్శవంతమైన పాత్రలే చేయా లని..ఆలాచేస్తేనే హీరో అవుతారని వారు అనుకుంటున్నారు. నేను అయితే అలా అనుకోను’ అంటూ సందీప్ వ్యాఖ్యానించాడు. దీంతో ఈ కామెంట్స్ షారుక్ ఖాన్ కి కౌంటర్ గానే వేసినట్లు నెటిజనులు అభిప్రాయం. ఇక ఈ మాటల యుద్దానికి ముందే షారుక్ ఖాన్ తో ఓ సినిమా చేయాలని ఉందని సందీప్ రెడ్డి వంగ ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. ఏ దర్శకుడైనా షారుక్ ఖాన్ తో కలిసి పనచేయడానికి ఎదురు చూస్తాడని..నేను కూడా అతని కోసం ఎదురు చూస్తున్నట్లు సందీప్ చెప్పుకొచ్చాడు. ఫ్యూచర్ లో తప్పకుండా సినిమా చేస్తానని అన్నారు. మరి ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగే ఈ గొడవలో వీరిద్దరూ ఫ్యూచర్‌లో కలిసి పనిచేసే ఆలోచన ఉంటుందో లేదో వేచి చూడాల్సిందే మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై తమిళిసైకి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారా...?

Most Popular