Saturday, November 23, 2024

ఆదాయంలో… బీఆర్ ఎ స్సే బాస్‌

ప్రాంతీయ పార్టీల్లో గులాబీ ‘రిచ్`

బీఆర్ఎస్ పార్టీ మ‌రోసారి దేశంలో చ‌ర్చ‌కెక్కింది. దేశంలోని రీజనల్ పార్టీల్లో బీఆర్ఎస్ రిచ్ అని వెల్లడైంది. అటు టీడీపీ, వైసీపీ ఖాతాల్లో ఉన్న ముగింపు నిల్వలను కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. టీడీపీ అకౌండ్‌లో రూ.272 కోట్లు ఉన్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పెట్టిన ఖర్చుల వివరాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ ఆడిట్‌ నివేదికను సమర్పించింది. దీన్ని ఎలక్షన్ కమిషన్ తాజాగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఆ నివేదిక ప్రకారం బీఆర్ఎస్ ఖాతాల్లో 1,449 కోట్ల రూపాయలు ఉన్నాయి. భారతదేశంలోని ప్రాంతీయ పార్టీల్లో బీఆర్ఎస్ ఖాతాల్లోనే ఎక్కువ డబ్బులు ఉన్నాయి.
ఇప్పటివరకు ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్‌ పార్టీ రూ.625 కోట్ల ముగింపు నిల్వలతో మొదటి స్థానంలో ఉండేది. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ దాన్ని అధిగమించింది. లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమయ్యే నాటికి బీఆర్ఎస్ అకౌంట్లలో రూ.1,519 కోట్లు ఉన్నాయి. ఎన్నికల ప్రకటన వెలువడిన నాటి నుంచి ముగిసేలోపు రూ.47.56 కోట్ల విరాళాలు వచ్చాయి.

ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు పెట్టినా…!
దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో భారత రాష్ట్ర సమితి అత్యంత రిచ్ పార్టీగా న‌మోదైంది. ఆ పార్టీ ఖాతాలో ఎన్నికల ఖర్చులు అయిపోయిన తర్వాత కూడా రు. 1449 కోట్ల రూపాయలు ఉన్నాయి. వచ్చే ఐదేళ్ల పాటు విరాళాలు రాకపోయినా విచ్చలవిడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. దేశంలో మరే ఇతర ప్రాంతీయ పార్టీకి కనీసం రూ. ఐదు వందల కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు. ఒడిషా అధికార పార్టీ బీజేడీ, తృణమూల్ పార్టీలకు ఐదు వందల కోట్ల దరిదాపుల్లో బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి. ఇక టీడీపీకి 227 కోట్లు ఉన్నట్లుగా ఈసీకి ఇచ్చిన రిపోర్టుల్లో తెలియచేశాయి. జాతీయ పార్టీల్లో బీజేపీకి ఉన్నంత సంపద ఏ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఘోరంగా ఉంది. ఆ పార్టీ కన్నా బీఆర్ఎస్ కే ఎక్కువ నిధులు ఉన్నాయి.

ఖ‌ర్చు పెట్టాం
ఎన్నికల ప్రచారం, ఇతర కార్యక్రమాలకు రూ.120 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు బీఆర్ఎస్ నివేదికలో వెల్లడించింది. వివిధ రకాల మాధ్యమాల్లో ప్రచారానికి రూ.10.51 కోట్లు, ప్రచార సామాగ్రికి రూ.34.68 కోట్లు, బహిరంగసభలు, ఊరేగింపులు, ర్యాలీలకు రూ.20.37 కోట్లు, ఇతర ప్రచారానికి రూ.34.39 కోట్లు ఖర్చు చేసినట్లు ఆడిట్ నివేదిక బీఆర్ఎస్ స్పష్టం చేసింది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల అభ్యర్థులకు రూ.95 లక్షల చొప్పున మొత్తం రూ.16.15 కోట్లు నేరుగా చెక్‌, డీడీ రూపంలో ఇచ్చినట్లు బీఆర్ఎస్ వెల్లడించింది. అభ్యర్థుల నేరచరిత్రపై ప్రకటనల కోసం రూ.73.17 లక్షలు ఖర్చు చేసినట్టు వెల్లడించింది. ఇక ఇతర రీజనల్ పార్టీల్లో తమిళనాడులోని డీఎంకే ఖాతాలో రూ.338 కోట్లు, సమాజ్‌వాదీకి రూ.340 కోట్లు, తెలుగుదేశం పార్టీకి రూ.272 కోట్లు, జేడీయూకు రూ.147 కోట్లు, జగన్ పార్టీ వైసీపీ ఖాతాలో రూ.27 కోట్ల ముగింపు నిల్వలు ఉన్నాయి.

వెన‌కేసున్న‌ట్టేనా..?
పదేళ్లు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ .. పార్టీఫండ్ ను బాగానే వెనకేసుకుంద‌ని ఇప్పుటు ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది. మేఘా కంపెనీ మహారాజ పోషకురాలిగా ఉంది. ఇతర సబ్సిడరీ కంపెనీలతో కలిసి బీఆర్ఎస్ ఖజానాను నింపింది. ఇతర విధాలుగానూ పెద్ద ఎత్తున విరాళాలువచ్చాయి. మొత్తంగా బీఆర్ఎస్ ఉనికిపై చాలా మందికి సందేహాలు ఉన్నాయి కానీ.. ఈ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే సోషల్ మీడియాలో అయినా పార్టీని నిలబెట్టుకుంటారని అర్థం చేసుకోవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular