Friday, February 28, 2025

ఆమెరికాలో కూతురు కోమా… వీసా కోసం తల్లిదండ్రుల తిప్పలు

ఈ మధ్య కాలంలో పిల్లలు ఉన్నత చదువుల కోసం వేరే దేశాలకు వెళ్ళడం సర్వ సాధారణం అయిపోయింది. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లిన మహారాష్ట్రకు చెందిన నీలం షిండే అనే యువతి అక్కడ రోడ్డు ప్రమాదానికి గురైంది. కాలిఫోర్నియాలో నీలం ప్రయాణిస్తున్న కారును మరో కారు వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నీలం కాళ్లు, చేతులు విరిగిపోయాయని, తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె కోమాలోకి వెళ్లిందని వైద్యులు తెలిపారు. ఈ నెల 14న ప్రమాదం జరగగా.. 16న తమకు తెలిసిందని నీలం తల్లిదండ్రులు చెప్పారు. కూతురు వద్దకు వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్లు నీలం తండ్రి తానాజీ షిండే వివరించారు. అయితే, ఇప్పటి వరకూ వీసా మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సాయం చేయాలంటూ ఎంపీ సుప్రియా సూలేను ఆశ్రయించారు.
ఈ విషయాన్ని ఎంపీ సుప్రియా సూలే ట్విట్టర్ ద్వారా భారత విదేశాంగ శాఖ దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్ర మంత్రి జైశంకర్ స్పందించి నీలం షిండే తల్లిదండ్రులకు వీలైనంత త్వరగా వీసా అందించేందుకు సాయపడాలని కోరారు. నీలం షిండే కుటుంబానికి తాము అండగా ఉంటామని సుప్రియా సూలే చెప్పారు. కాగా, సతారా జిల్లాకు చెందిన నీలం షిండే నాలుగేళ్ల క్రితం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లింది. ఈ ఏడాదితో చదువు పూర్తవుతుందని, ఇంతలోనే ఇలా జరిగిందని తానాజీ షిండే కన్నీటి పర్యంతమయ్యారు. చదువు పూర్తయి తిరిగి తల్లిదండ్రుల వద్దకు వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూసే వారికి చివరకు నిరాశ ఎదురయింది. కూతురు కాళ్ళు.. చేతులు కోలిపోయి దీన స్థితిలో చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్ర‌దాన వార్త‌లు

గవర్నర్ అంటే అంత లెక్కలేనితనమా? అన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com