Saturday, May 10, 2025

ఇంతకీ ఎవరిదగ్గర ఉన్నట్టు సమంత, శోభిత?

హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2017లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇండస్ట్రీలో బెస్ట్ జోడిగా ఉంటారనుకునేలోపే వీరు విడిపోయారు.పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు. విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే వారిద్దరు తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకున్నారు. సమంతతో విడాకులు తర్వాత నాగ చైతన్య శోభితతో రిలేషన్‌లో ఉన్నాడు. నా బేబీతో..నేను అంటూ ” నాగ చైతన్య శోభితతో ఉన్న బంధాన్ని పెళ్లిగా మార్చుకున్నాడు. ఈ క్రమంలోనే సైలెంట్‌తో శోభితను రెండో వివాహం చేసుకున్నాడు. సమంత ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. సమంత, నాగ చైతన్య కలిసి ఉన్నప్పుడు ఓ కుక్కను ప్రేమగా పెంచుకున్నారు. దాని పేరు హ్యాష్. సమంత, నాగ చైతన్య విడాకుల తర్వాత హ్యాష్ ఎవరి దగ్గర ఉంటుందనే ప్రశ్న ఉండిపోయింది. హ్యాష్ నాగ చైతన్య దగ్గరే ఎక్కువగా కనిపించింది. దీంతో సమంత హ్యాష్‌ను వదిలేసిందనే అంతా భావించారు. ఇటీవల శోభితతో హ్యాష్ కనిపించింది. అయితే తాజాగా హ్యాష్ సమంతతో కూడా దర్శనం ఇచ్చింది. ఈ క్రమంలో శోభిత ఈ మధ్యనే హష్‌తో ఇన్‌స్టాగ్రామ్ లో ఫొటోలు పెట్టిన సంగతి తెలిసిందే. పచ్చగా ఉండాలి అంటే నీళ్లు పోయాలి అనే క్యాప్షన్ కూడా పెట్టింది. సమంత పక్కన హష్ కూర్చుని ఎంతో ప్రేమగా కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

 

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com