యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అన్న విషయం తెలిసిందే. ఆయన చేసిన సినిమాలకి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఎన్టీఆర్ చివరిగా దేవర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఇక దేవర పార్ట్ 2తో పలకరించనున్నాడు జూనియర్. ఈ సినిమాని కూడా వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు కొరటాల శివ. అయితే ఎన్టీఆర్ ఈ మధ్య బాలీవుడ్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వార్ 2అనే చిత్రాన్ని చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ చిత్రంలో హృతిక్ రోషన్‌తో కలిసి పని చేస్తున్నాడు. ఈ మూవీ గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటుంది. మూవీకి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు బయటకు వస్తుండడంతో ప్రేక్షకులు ఫుల్ థ్రిల్ అవుతున్నారు.
యశ్ రాజ్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ స్పై థ్రిల్లర్‌కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. వార్ మూవీ సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో ఎన్టీఆర్ నటిస్తున్న కారణంగా సౌత్ ప్రేక్షకులు సైతం ఇప్పుడు వార్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. హిందీతో పాటు తెలుగులోనూ విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో రూపొందుతుంది. విలే పార్లే స్టూడియోలో ఈ సినిమా కోసం భారీ సెట్‌ని వేశారంట. ఈ సెట్ లో హృతిక్, ఎన్టీఆర్ మధ్య ఫైట్ సీక్వెన్స్ జరుగుతున్నట్టు సమాచారం.
ఈ సీక్వెన్స్‌కి సంబంధించిన పలు ఫొటోలు ఇటీవల బయటకు రాగా, అవి నెట్టింట తెగ హల్చల్ చేశాయి. తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న వార్త ప్రకారం చూస్తే.. వార్2 చిత్రంలో ఎన్టీఆర్ చనిపోతాడని, ఆ తర్వాతే హృతిక్ రోషన్ పూర్తిగా మారిపోతాడని సమాచారం. ఇది విని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఎన్టీఆర్ చనిపోతే మూవీకి కూడా నెగెటివిటీ వస్తుందని, ఎన్టీఆర్‌ని చంపడం లాంటివి చేయోద్దని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వార్ 2.. వచ్చే ఏడాది ప్రేక్షకులు ముందుకు రానున్నది.