Tuesday, November 26, 2024

కష్టార్జితం రోడ్డుపాలు వాహనదారులకు రేవంత్ సర్కార్ బిగ్ షాక్

రాష్ట్రంలో వాహనదారులకు షాక్ ఇవ్వడానికి రేవంత్ ప్రభుత్వం రెడీ అయింది. చాలా రాష్ట్రాలలో రవాణాశాఖ ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తున్న క్రమంలో ఆయా రాష్ట్రాలలో అనుసరిస్తున్న విధానాలను స్టడీ చేసిన తెలంగాణ ట్రాన్స్​పోర్ట్​ అధికారులు.. రాష్ట్రంలోనూ ఆ విధానాలను అమలు చేయాలని భావిస్తున్నారు. దీనికోసం సమగ్ర నివేదికను సిద్ధం చేసి సీఎంకు ఇచ్చారు. అదే జరిగితే తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ట్యాక్స్ పెరిగే అవకాశం ఉంది. దీంతో వాహనదారుల జేబులకు చిల్లుపడే అవకాశం కూడా ఉంది.

పెంచక తప్పదు
పక్క రాష్ట్రాలలో రవాణా శాఖ ఆదాయంపైన అధ్యయనం చేసిన అధికారులు కీలక నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో త్వరలో పెట్రోల్, డీజిల్ తో నడిచే నూతన వాహనాలకు విధించే రోడ్డు ట్యాక్స్ పెంచాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే దీనిపైన కసరత్తు ప్రారంభించిన అధికారులు పక్క రాష్ట్రాలలో రవాణా శాఖలో వస్తున్న ఆదాయంపైన అధ్యయనం చేశారు. వాహనాల ద్వారా వస్తున్న ఆదాయం, రిజిస్ట్రేషన్ విధానం తదితర అంశాలపైన సుదీర్ఘంగా అధ్యయనం చేశారు. దీనికి సంబంధించిన నివేదికను రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘానికి ఇచ్చారు.
ఒకవేళ రోడ్డు టాక్స్ పెంచితే లక్ష రూపాయల కంటే ఎక్కువ ధరలు ఉన్న బైకులు, 10 లక్షల కంటే ఎక్కువ విలువైన కార్లకు రోడ్డు టాక్స్ పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. రాష్ట్రంలో రోడ్డు టాక్స్ పెరిగే అవకాశం ఉన్నా, అది ఇతర రాష్ట్రాల కంటే తక్కువగానే ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం రోడ్డు టాక్స్ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి సుమారు 7000 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఒకవేళ రోడ్డు టాక్స్ పెంచితే 8,000 కోట్ల రూపాయల నుంచి 9000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రోడ్ ట్యాక్స్ వసూళ్లు పలు విడుతల్లో ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పుడు ఐదు లక్షల రూపాయల ధర లోపు ఉన్న కార్లకు 13 శాతం , ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల మధ్య ధర ఉన్న కార్ల కోసం 14%, 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల మధ్య ధర ఉన్న కార్ల కోసం 17%, 20 లక్షల రూపాయల నుంచి ఆ పైన ధర ఉన్న కార్ల కు 18 శాతం టాక్స్ వసూలు చేస్తున్నారు. ఇక ద్విచక్ర వాహనాలకు సంబంధించి 50 వేల లోపు వాహనాలకు 9 శాతం ఆపై విలువ ఉంటే 12 శాతం రోడ్ టాక్స్ వసూలు చేస్తున్నారు.
ప్రస్తుతం మళ్లీ రోడ్డు టాక్స్ పెంచాలని అధికారుల ప్రతిపాదనలను సబ్ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ ఇదే గనక జరిగితే కొత్త వాహనాలు కొనాలనుకునే వారికి ఇది బ్యాడ్​ న్యూస్ అనే చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular