Thursday, December 26, 2024

కొనుగోలుదారులను మోసం చేసిన కంట్రీసైడ్‌ రియల్ ఎస్టేట్ కంపెనీపై కేసు

హైదరాబాద్‌లోని కంట్రీసైడ్ రియల్టర్స్ కంపెనీ డైరెక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమను మోసం చేశారని రంగారెడ్డి జిల్లా మోకిలాకు చెందిన వెస్టెండ్ గ్రీన్స్ గేటెడ్ కమ్యూనిటీకి చెందిన విల్లా యజమానుల ఫిర్యాదు మేరకు వారిపై ఎఫ్ ఐఆర్ రిజిస్టర్ చేశారు.
కంట్రీసైడ్ రియల్టర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ డైరెక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా మోకిలాకు చెందిన వెస్టెండ్ గ్రీన్స్ గేటెడ్ కమ్యూనిటీకి చెందిన విల్లా యజమానుల ఫిర్యాదు మేరకు వారిపై కేసు రిజిస్టర్ చేశారు. జీహెచ్ ఎంసీ, రెరా నుంచి అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పి తమకు విల్లాలు అమ్మారని రంగారెడ్డి జిల్లా మోకిలాకు చెందిన వెస్టెండ్ గ్రీన్స్ గేటెడ్ కమ్యూనిటీకి చెందిన విల్లా యజమానుల ఫిర్యాదు చేశారు. కాగా కంట్రీసైడ్ రియల్టర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్స్ పై 420, ఆర్థిక నేరాల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

అసలేమైంది..?
మోకిలాకు చెందిన వెస్టెండ్ గ్రీన్స్ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రోషన్ తో పాటు మరికొంత మంది కలిసి పోలీసులను ఆశ్రయించారు. తమకు తప్పుడు పత్రాలు చూపి కంట్రీసైడ్ రియల్టర్స్ వారు విల్లాలను అమ్మారని.. వారు చేసిన మోసం వల్ల తాము ఆర్థికంగా, మానసికంగా ఎంతగానే ఇబ్బందులకు గురయ్యామని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సంస్థకు చెందిన డైరెక్టర్లు మహ్మద్ మసూద్ ఉల్ హసన్, సింహా కవినరసింహం, మేనేజర్ సౌరభ్ పాండేతో కలిసి ప్రాతినిధ్యం వహిస్తున్న కంట్రీసైడ్ రియల్టర్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ నుండి అవసరమైన అనుమతులతో గేటెడ్ కమ్యూనిటీగా ప్రమోట్ చేయబడిన ప్రాజెక్ట్‌లో తమకు విల్లాలను విక్రయించారని నివాసితులు ఆరోపించారు. హెచ్ఎండీఏ ముసాయిదా ఆమోదం నవంబర్ 2017లో ముగిసిందని.. ఆ కంపెనీ వాళ్ళు చెప్పింది అంత అబద్దాలు అని అన్నారు. కాగా నివాసితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బీఎన్ ఎస్ లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com