Saturday, September 21, 2024

తెలంగాణ నుంచి సోనియా పోటీ పరిశీలనలో నాలుగు స్థానాలు పీఏసీలో తీర్మానం

తెలంగాణ నుంచి కాంగ్రెస్​ మాజీ చీఫ్​, ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ పోటీ చేయనున్నట్లు స్పష్టమవుతున్నది. ఈ మేరకు కాంగ్రెస్​ పొలిటికల్​ అఫైర్​ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గాంధీభవన్​లో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్ కమిటీ సమావేశం ముగిసింది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్​ఇంఛార్జి ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ, సీనియర్​ నేత వి. హనుమంతరావు తదితరులు హాజరయ్యారు.
ప్రధానంగా 5 అంశాల ఎజెండాగా పీఏసీ సమావేశం సాగింది. ముందుగా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకువచ్చి సంపూర్ణ మద్దతు పలికిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఆహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, ఏఐసీసీ అగ్ర నేతలు, ప్రచారంలో పాల్గొన్న నాయకులు, ఇంచార్జ్‌లుగా పని చేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు చెపుతూ తీర్మానం చేశారు. అలాగే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పోటీ చేయాలని పీఏసీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.

పరిశీలనలో నాలుగు నియోజకవర్గాలు
తెలంగాణ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశాలున్నాయని ఇప్పటి వరకు ప్రచారం జరిగింది. కానీ, పార్టీ పొలిటికల్​ అఫైర్​ కమిటీ మాత్రం సోనియా గాంధీ పేరును సూచిస్తూ తీర్మానం చేసింది. దీంతో సోనియా గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది. వచ్చే లోక్​సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని పార్లమెంట్​ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. అయితే, కాంగ్రెస్​పార్టీ ఇప్పటికే సెగ్మెంట్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కరీంనగర్​, మెదక్​, నిజిమాబాద్​, మహబూబ్​నగర్​ పార్లమెంట్​ నియోజకవర్గాల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

పీఏసీలో ఐదు అంశాల ఎజెండా
1. అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన పీఏసీ
2. తెలంగాణ కాంగ్రెస్ గెలుపు కు కృషి చేసిన ఏఐసీసీ నేతలకు ధన్యవాదాలు తెలిపిన పీఏసీ
3. ఆరు గ్యారంటీల అమలుపై చర్చ
4. లోక్‌సభ ఎన్నికల వ్యూహంపై చర్చించిన పీఏసీ
5. సోనియా గాంధీని ఎంపీగా తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసిన పీఏసీ

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular