Sunday, May 4, 2025

దిల్ రాజు “LorVen” ఏఐ స్టూడియో ప్రారంభం

– ఈ టెక్నాలజీతో ఎన్ని లాభాలంటే?
– స్టూడియోకి ఆ పేరు పెట్టడానికి కారణం?
– నిర్మాతలకు, దర్శకులకు ఎంత ఉపయోగపడుతుందంటే?
టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సినిమాలతో కలిపే దిశగా అడుగువేశారు. ముందుగానే ప్రకటించిన విధంగా ‘LorVen AI Studio’ అనే అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టూడియోను ప్రారంభించారు. ఇది టాలీవుడ్‌లోనే తొలి AI-బేస్డ్ స్టూడియో కావడం ఇప్పుడు హాట్‌ టాపిక్ గా మారింది. అందుకే ఆ పేరు..? ఈ స్టూడియో ప్రారంభోత్సవ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై, స్టూడియోను లాంచ్ చేశారు. దర్శక దిగ్గజాలు రాఘవేంద్రరావు, వి.వి. వినాయక్, అనిల్ రావిపూడి వంటి వారు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ”Lord Venkateshwara” పేరులోని మొదటి అక్షరాలను తీసుకుని ‘LorVen’ అని స్టూడియోకు పేరు పెట్టినట్టు దిల్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం ఈ ఆలోచన మొదలైందని చెప్పారు. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ వినియోగం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పెరిగిపోతోందని.. సినిమా రంగంలో కూడా ఇది విప్లవాత్మక మార్పులకు దారితీస్తోందన్నారు. అందుకే ప్రముఖ క్వాంటమ్ ఏఐ సంస్థతో కలిసి దీన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. ఒక సినిమా కథ సిద్ధమైన వెంటనే.. దానిని AI సహాయంతో ఫ్రీ-విజువలైజ్ చేయవచ్చని తెలిపారు. దీంతో నిర్మాతలకు, దర్శకులకు ఎంతో ఉపయోగపడుతుందని.. సినిమా వర్కౌట్ అవుతుందా లేదా అనే అంచనాలు ముందే వేసుకోవచ్చని స్పష్టం చేశారు. అంతే కాకుండా స్క్రిప్ట్ సెలక్షన్, ప్రీ-ప్రొడక్షన్, కాస్టింగ్ లెవెల్‌లోనూ ఎంతో సహాయపడుతుందని వివరించారు. LorVen AI Studioలో కేవలం కథలు పునర్నిర్మించడమే కాకుండా.. డిజిటల్ డబ్లికేషన్, డీప్‌ఫేక్ టెక్నాలజీ ఆధారంగా వాయిస్ మోడ్యూలేషన్, ఫేస్ డూప్లికేషన్, వర్చువల్ యాక్టింగ్ లాంటి ఫీచర్లు కూడా అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com