Monday, November 25, 2024

దేశ ప్రజలే వారికి సరైన శిక్ష విధిస్తారు పార్లమెంట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ ఫైర్

ప్రజల నుంచి తిరస్కరణకు గురైన కొందరు గూండాయిజం ద్వారా పార్లమెంట్‌ ను నియంత్రించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారంటూ ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశ ప్రజలు వారి చర్యలన్నింటినీ లెక్కిస్తారని, సరైన సమయంలో శిక్ష విధిస్తారని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతోందని ప్రధాన మంత్రి మోదీ గుర్తు చేశారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు పార్లమెంట్‌ వెలుపల మీడియా పాయింట్‌ వద్ద ప్రధాని మాట్లాడారు. విపక్ష కాంగ్రెస్ పార్టీపై ముప్పేట దాడి చేశారు. ప్రజలు పదే పదే తిరస్కరించిన పార్లమెంటును, ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తున్నారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కొందరు వ్యక్తులు చేతికింద మనుషులను పెట్టుకొని గూండాయిజం ద్వారా పార్లమెంటును నియంత్రించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
`కొందరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారు. ప్రజలచే తిరస్కరణకు గురైన కొందరు గూండాయిజం ద్వారా పార్లమెంటుపై నియంత్రణకు ప్రయత్నిస్తున్నారు. సొంత లబ్ధి కోసం పార్లమెంటు సమావేశాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేశ ప్రజలు వారి చర్యలన్నింటినీ లెక్కిస్తారు. సరైన సమయంలో ప్రజలే శిక్ష విధిస్తారు. పార్లమెంట్‌లో సానుకూల చర్చలు జరగాలని కోరుకుంటున్నా’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఈ పార్లమెంట్‌ సమావేశాలు ఎన్నో అంశాలపరంగా ముఖ్యమైనవని ప్రధాని అన్నారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి నవంబర్‌ 26 నాటికి 75వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నామన్నారు. దానికి గుర్తుగా మంగళవారం సంవిధాన్‌ సదన్‌లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించినట్లు తెలిపారు. రాజ్యాంగ అమలు ఉత్సవాలు ఐక్యంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular