Friday, November 15, 2024

పాట పాడుతున్నారా.. జాగ్ర‌త్త‌

సింగ‌ర్ దిల్జిత్‌కు సర్కార్ షాక్
డ్ర‌గ్స్ వినియోగంపై హెచ్చ‌రిక‌లు

మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. హైదరాబాద్‌లో డ్రగ్స్ అమ్మకాలు ఇప్పటికే విచ్చలవిడిగా సాగుతున్నాయంటూ ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో దాన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఈ క్రమంలో ప్రఖ్యాత నటుడు, గాయకుడు దిల్జిత్ దొసాంజ్‌కూ తెలంగాణ ప్రభుత్వం నోటీసులను జారీ చేసింది. దిల్- లుమినాటి పేరుతో నేడు ఆయన మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించబోతోన్న నేపథ్యంలో మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఈ నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కన్సర్ట్ నిర్వాహకులకూ నోటీసులు ఇచ్చింది.
మ్యూజిక్ కన్సర్ట్‌ సందర్భంగా మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగాన్ని ప్రోత్సహించేలా ఉండే ఎలాంటి పాటలను ఆలపించకూడదని ఆదేశించింది ప్రభుత్వం. హింసను ప్రేరేపించేలా, చిన్నారులపై ఆకృత్యాలకు సంబంధించిన పాటలనూ పాడకూడదని సూచించింది. మ్యూజికల్ కన్సర్ట్, లైవ్ షో కొనసాగుతున్న సమయంలో చిన్న పిల్లలను వినియోగించుకోకూడదని, వారితో ఎలాంటి పనలనూ చేయించకూడదని దిల్జిత్ దొసాంజ్‌కు సూచించింది. చిన్న పిల్లలకు హాని కలిగించేలా ఫ్లాష్ లైట్లను వేయకూడదని, లౌడ్ స్పీకర్లను వినియోగించకూడదని పేర్కొంది. 13 సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు 120 డెసిబల్స్‌కు మించిన శబ్దాన్ని వినకూడదంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధలు స్పష్టం చేస్తోన్నాయని, దీనికి అనుగుణంగానే లౌడ్ స్పీకర్లను వాడుకోవాలని మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular