Thursday, January 2, 2025

పుష్ప2తో డాల్బీ విజన్‌ స్టార్ట్‌

– దేశంలో మొట్టమొదటిసారిగా అన్నపూర్ణలో
– ఆనందంగా ఉందన్న నాగార్జున

డాల్బీవిజన్‌ టెక్నాలజీ దీని గురించి ప్రస్తుతం తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ఆడియన్స్‌కి ఇదొక విభిన్నమైన సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. దాదాపుగా ప్రతీ మల్టీప్లక్స్‌ సినిమాలలో ఇప్పుడు సినిమా స్టార్ట్‌ అయ్యే ముందే ఈ డాల్బీ విజన్‌ బొమ్మ వస్తుంది. మంచి సౌండ్‌ ఎఫెక్ట్స్‌తో. ఇక ఆ బొమ్మ కూడా చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంటుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీని అన్నపూర్ణ స్టూడియోస్ లో కొత్తగా డాల్బీ విజన్ ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇఫ్ఫీ సినీ వేడుకలో పాల్గొన్న టాలీవుడ్ కింగ్ నాగార్జున దీని గురించి మాట్లాడారు.
దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని డాల్బీ విజన్ టెక్నాలజీ సాయంతో తెరకెక్కించాలని భావించాడని, కానీ మన దేశంలో డాల్బీ విజన్ స్టూడియోలు లేకపోవడంతో ఆయన జర్మనీ వెళ్లి పనులు పూర్తి చేసుకున్నారని వివరించారు. ఇప్పుడు దేశంలో మొట్టమొదటిసారిగా డాల్బీ విజన్ టెక్నాలజీని తాము అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేశామని, పుష్ప 2 ది రూల్ చిత్రంతో ఈ సరికొత్త టెక్నాలజీని ప్రారంభిస్తున్నామని నాగార్జున చెప్పారు. ఈ వరల్డ్ క్లాస్ టెక్నాలజీని తొలిసారిగా తాము అందుబాటులోకి తీసుకువస్తుండడం సంతోషం కలిగిస్తోందని అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com