Thursday, November 14, 2024

పొంగులేటి ఆట షురూ గులాబీకోటలో మంత్రి బాంబులు

సంతకాలు పెట్టింది నేనే, పర్మిషన్లు ఇచ్చింది నేనే, అన్నీ నేనే. అంతటా నేనే. కానీ తప్పు ఎక్కడా జరగలేదు. ఫార్ములా ఈ రేసింగ్ గురించి ఇదీ కేటీఆర్ చెప్పుకుంటున్న మాట. అంతే కాదు డబ్బులు అవసరం పడితే డిపార్ట్ మెంట్స్ మధ్య అడ్జస్ట్ మెంట్స్ చేసుకుంటాయని, అది చాలా కామన్ అని వివరించుకునే యత్నం చేసిన కేటీఆర్.. ఫార్ములా ఈ రేసింగ్ కు hmda ఇచ్చిన డబ్బు అడ్జస్ట్ మెంట్ కాదన్నది మర్చిపోయారు. నాన్ రిఫండబుల్ అని తెలియదా? కార్ రేసింగ్ తో హైదరాబాద్ ఒక్కసారిగా విశ్వనగరంగా మారిపోయిందా అన్న ప్రశ్నల్ని కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నారు.

ఎందుకు అంత హడావుడి..?
అరెస్ట్ గురించి కేటీఆర్ ప్రతి క్షణం ఆలోచిస్తున్నారెందుకు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మొన్నటికి మొన్న మంత్రి పొంగులేటి సియోల్ లో ఉన్నప్పుడు దీపావళి బాంబులు పేలబోతున్నాయ్ అని చెప్పగానే గులాబీ శిబిరంలో ఎక్కడ లేని కలవరం, ఉలికిపాటు మొదలయ్యాయి. ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియా సానుభూతిపరులైతే రెండాకులు ఎక్కువే చదివి ఏంటి ఆ పేలబోయే బాంబు అని రకరకాల చర్చలు జరిపి ఉన్నవి లేనివన్నీ వారంతట వారే బయటపెట్టుకున్నారా అన్న చర్చ జరిగింది. చివరికి ఏ బాంబూ పేలలేదని, పొంగులేటి పేలుస్తానన్న దీపావళి బాంబు తుస్సుమన్నదని సెటైర్లు కూడా సోషల్ మీడియాలో విసిరారు.
ఇంకా ఎన్నో ఎన్నెన్నో జరగాలని బీఆర్ఎస్ వర్గాలు కోరుకుంటున్నాయా అంటే అవునన్న సమాధానమే వస్తోంది. అర్జంటుగా కేటీఆర్ ను అరెస్ట్ చేయాలని కోరుకోవడం, ప్రతిగా ఆందోళనలు చేయాలనుకోవడం ఇవన్నీ అతిగా ఊహించుకుంటున్నారన్న చర్చ కూడా నడుస్తోంది. మరోవైపు విచారణ పూర్తయ్యాకే చర్యలు చేపడతామని.. విచారణ లేకుండా చర్యలు చేపట్టబోమంటూ ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. సింపతి డ్రామాలకు అవకాశం ఇవ్వబోమంటూ సిగ్నల్స్ కూడా ఇస్తున్నారు. ఇక ఏసీబీ చేపట్టే ఫార్ములా ఈ రేసింగ్ విచారణ రిపోర్ట్ ను అసెంబ్లీ ముందుంచేలా చర్యలు తీసుకుంటామంటున్నారు. అన్నీ చర్చించి, నిజాలు నిగ్గు తేల్చాకే చర్యలు ఉంటాయన్న వెర్షన్ ను ప్రభుత్వం వినిపిస్తోంది.

ఫార్ములా ఈ రేసింగ్ కు సంబంధించి 55 కోట్ల రూపాయల నిధుల విడుదలకు క్యాబినెట్ అప్రూవల్ అవసరం లేదని ఎందుకంటే అది ఇండిపెండెంట్ బాడీ నిధులు అని సమాధానం చెప్పుకుంటున్నారు కేటీఆర్. పైగా ఆర్థిక శాఖతోనూ అవసరం లేదని, అవి అక్కడి నిధులు కూడా కావని తానే చెబుతున్నారు. డబ్బులు అవసరం ఉంటే డిపార్ట్ మెంట్స్ మధ్య నిధులు సర్దుబాటు అప్పుడప్పుడు జరుగుతుందని, అది కామన్ అంటున్నారు. హెచ్​ఎండీఏ ఇండిపెండెంట్ బోర్డ్ అని లెక్కలు చెబుతున్నారు. మరి పైసా లాభం లేకపోయినా డబ్బులెందుకు విదేశాలకు పంపారన్న పాయింట్ కు సరైన జవాబు లేకుండా పోయిందంటున్నారు.
ఇక మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి పొంగులేటి తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఇందిరమ్మ రాజ్యంలో తప్పు చేసిన ఎవరినైనా వదిలిపెట్టబోమని.. చిన్న దొరనైనా, పెద్దదొరైనా ఒకటే అని వార్నింగ్ ఇచ్చారాయన. పొలిటికల్ బాంబ్ పేలబోతుందని.. తాను అంటే బీఆర్ఎస్ వాళ్లు నవ్వుకున్నారని, కానీ ఇప్పుడు పేలబోయేది నాటు బాంబ్‌ కాదు.. లక్ష్మీ బాంబ్‌ కాదని, అది ఆటం బాంబ్‌ అని మరో బాంబ్ పేల్చారు పొంగులేటి. తప్పుచేసిన వారిని చట్టం వదిలిపెట్టదన్నారు. ఏ తప్పూ చేయకపోతే అంత ఉలికిపాటు ఎందుకని కడిగిపారేస్తున్నారాయన. సో గ్రౌండ్ క్లియర్ గా ఉంది. చట్టపరంగా జరగాల్సినవన్నీ చక్కగా, పకడ్బందీగా జరగడం కామనే. ఇందులో ఎవరూ ఎలాంటి డౌట్లు పెట్టుకోనక్కర్లేదని కాంగ్రెస్ అంటోంది. తినబోతూ రుచులెందుకంటున్నారు. సో కేటీఆర్ కలగంటున్నది జరుగుతుందా జరగదా.. అన్నది పక్కన పెడితే అందరికంటే ముందుగా కేటీఆరే ఎక్కువ ఊహించుకోవడం చుట్టే పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular