- పూర్తిగా రుణమాఫీ అయ్యేదాకా కాంగ్రెస్ వెంట పడుతూనే ఉంటాం
- మాజీ మంత్రి హరీష్ రావు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బయట ప్రశ్నిస్తే పోలీసు కేసులు, అసెంబ్లీలో ప్రశ్నిస్తే సస్పెన్షన్లు విధిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మెదక్ లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరా పార్కు దగ్గర ధర్నాలకు అనుమతించడం లేదు. ఆశా వర్కర్లను సొమ్మసిల్లేలా పోలీసులతో కొట్టిస్తున్నారని ఆరోపించారు. రెండు లక్షల రుణమాఫీ మీద ప్రభుత్వం చేతులెత్తేసింది. రుణమాఫీ అయినవాళ్లు తక్కువ, కాని వాళ్లు ఎక్కువ. 6 నెలలైనా ఇప్పటికీ అందరికీ మాఫీ కావడం లేదు. రేవంత్ రెడ్డి దేవుళ్లమీద ఒట్టుపెట్టి రైతులను మోసం చేశాడు. దేవుళ్లనే మోసం చేసిన రేవంత్ రెడ్డికి రైతులను మోసం చేసుడు ఓ లెక్కా.. అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో మేం అడుగుతుంటే ప్రతి దాడులు చేస్తున్నారు.
కానీ సమాధానమివ్వడం లేదు.. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తివేశారు.రైతులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని, రుణమాఫీ మీద నిలవానాకాలం రైతు బంధు ఎగ్గొట్టారు. యాసంగి రైతు బంధును ఊరించి వేస్తున్నారు. బడా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు. రైతుబంధు ఇవ్వమంటే డబ్బులుండవు. రిటైరైన ఉద్యోగులకు డబ్బులివ్వమంటే ఉండవు. 25న అంగన్ వాడీలకు జీతాలు పడలేదు. 1వ తేదీనే జీతాలిస్తామని చెబుతున్నారు, మాటలే తప్ప చేతలు లేవు. డబ్బుల్లేవంటున్నారు.
20 వేల కోట్లతో హెచ్ఎండీఏలో టెండర్లు ఎట్లా పిలుస్తున్నారు. రూ.15 వేల కోట్లతో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ టెండర్లు ఎట్లా పిలుస్తున్నారు. రూ.7 వేల కోట్లతో జీహెచ్ఎంసీలో టెండర్లు ఎలా పిలుస్తున్నారు. నీ భూములున్న మీ అత్తగారిల్లు ఆమన్ గల్ కు రూ.5వేల కోట్లతో 10 లైన్ల రోడ్డు ఎలా వేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ పేరు మీద మా నిరుద్యోగులకు భృతి ఇవ్వమంటే డబ్బుల్లేవు అంటున్నారు. రైతుబంధు, ఉద్యోగులకు డీఏలు, పీఆర్సీ, రిటైర్డు ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. రైతాంగం ఎక్కడికక్కడ రైతుబంధు, సంపూర్ణ రుణమాఫీ అయ్యేదాకా కాంగ్రెస్ పార్టీ వెంట పడుతూనే ఉంటాం అని హరీష్ రావు హెచ్చరించారు. రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ ను నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.