ప్రముఖ నటుడు కమల్ హాసన్ పేరుకు ముందు ఉన్న బిరుదులను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. నటుడు ఎంఎన్ఎం పార్టీ అధినేత కమల్ హాసన్ లోకనాయకుడు (ఉలగనాయగన్)
ఈ మేరకు అభిమానులను ఉద్దేశించి సుదీర్ఘ లేఖ రాశారు. ఇక నుంచి తనను ‘కమల్ హాసన్’ అనే పేరుతో సంబోధిస్తే చాలని తెలిపారు. పేరుకు ముందు బిరుదులేవీ వద్దని సూచించారు.
లోకనాయకుడు, ఇంకా ఇతర బిరుదులతో నన్ను పిలుచుకుంటూ, ఎంతో ప్రేమను ప్రదర్శించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, అయినప్పటికీ ఇకపై బిరుదులను తన పేరు ముందు చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నానని కమల్ హాసన్ స్పష్టం చేశారు. ఎందుకంటే, సినీ రంగంలో తనను తాను నిత్య విద్యార్థిగానే భావిస్తానని, ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉంటానని తన లేఖలో వినమ్రంగా పేర్కొన్నారు.
సినిమా రంగం అనేది అందరికీ చెందుతుందని, లెక్కలేనంతమంది కళాకారుల సహకార ఫలితమే సినిమా రంగం అని వివరించారు. టెక్నీషియన్లు, ప్రేక్షకులు కూడా సినిమా రంగంలో భాగమేనని…. కళను మించి తాను గొప్పవాడ్ని కాదని కళాకారుడు ఎప్పుడూ అనుకోరాదని, అందుకే తాను ఎంత ఎదిగినా కళామతల్లి ముందు ఒదిగి ఉండాలని భావిస్తానని కమల్ వివరించారు.