Thursday, October 3, 2024

మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

మంత్రిగా ఉన్న సమయంలో కెటిఆర్ అనేక మంది సినిమా హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని, సమంత, నాగచైతన్య విడిపోడానికి కారణం కెటిఆర్ అని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెటిఆర్ తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారని, కొందరు హీరోయిన్లు సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకుంటే మరికొందరు త్వరగా పెళ్లి చేసుకున్నారని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. సినిమా పరిశ్రమలో ఈ విషయం బహిరంగ రహస్యమన్నారు. బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. గాంధీభవన్‌లో జరిగిన చిట్‌చాట్‌తో పాటు లంగర్ హౌస్‌లోని బాపూఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. బిసి మహిళనైన తనపై అసభ్యకర పోస్టులు పెట్టడం బాధాకరమని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టాలని కెటిఆరే ఆ పార్టీ కార్యకర్తలకు చెప్పినట్లు ఉందన్నారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా అందరినీ ఇబ్బందులకు గురిచేశారన్నారు. కెటిఆర్ మత్తు పదార్థాలకు అలవాటు పడి వారిని కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు పెట్టారని ఆమె విమర్శించారు. బ్లాక్ మెయిల్ చేసి వాళ్ల జీవితాలతో ఆడుకున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.కెటిఆర్ మాదిరిగానే అందరూ ఉంటారని అనుకుంటున్నారని మంత్రి కొండా సురేఖ దుయ్యబట్టారు. మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టమని కెటిఆర్ తన టీమ్‌కు చెప్పినట్లు ఉన్నారన్నారు. అకౌంట్ నాది కాదు అన్నప్పుడు వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పాలి కదా అని మంత్రి కొండా ప్రశ్నించారు. వారిని పార్టీ నుంచి బహిష్కరించవలసిన అవసరం ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రి సీతక్క, మేయర్ విజయలక్ష్మి మీద అసభ్యకర
అర్ధరాత్రి నడి రోడ్డుపై మహిళ ఒంటరిగా నడిస్తేనే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని మహాత్మా గాంధీ చెప్పారని, కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆమె అవేదన వ్యక్తం చేశారు. తనపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, చిన్న పిల్లలు బయటకు వెళితే సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తారన్న నమ్మకం లేదని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసై దారుణాలకు పాల్పడుతున్నారని దీనివల్ల అనేక కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోతున్నాయన్నారు. ఎస్టీ మహిళ, మంత్రి సీతక్క, మేయర్ విజయలక్ష్మి మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టారని ఇప్పుడు బిసి మహిళనైన తనపై అసభ్యకరంగా పోస్టులు పెట్టడం బాధాకరం అన్నారు.

కెటిఆర్‌కు తల్లి అక్క, చెల్లెలు లేరా?
బిఆర్‌ఎస్‌లో తాను ఐదేళ్లు పని చేశానని తన వ్యక్తిత్వం అందరికీ తెలుసని కొండా సురేఖ అన్నారు. కెటిఆర్‌కు తల్లి అక్క, చెల్లెలు లేరా? అని మంత్రి కొండా ప్రశ్నించారు. రాజకీయ విలువలు దిగజారిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తి చూపాలి తప్పితే వ్యక్తుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయవద్దని మంత్రి కొండా హితవు పలికారు. బిఆర్‌ఎస్ సోషల్ మీడియా నుంచి అసభ్యకరమైన పోస్టులు వస్తే ఊరుకునేలేదని ఆమె హెచ్చరించారు.

317 జీవో బాధితులతో మంత్రి పొన్నం ప్రభాకర్ 317 జీవో పెట్టినవాడే ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడు కమిటీ సభ్యుడిగా చెప్తున్న 317 జీవో బాధితులకు అన్యాయం జరగనివ్వం 317 జీవో బాధితుల కోసం సబ్ కమిటీ వేశాం. పలు కారణాల వల్ల సమస్య పరిష్కారం వాయిదా పడింది కమిటీ అనేక అంశాలపై అధ్యయనం జరిగింది గాంధీ జయంతి రోజు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు 317 జీవో సమస్య పరిష్కారం కోసం కట్టుబడి ఉన్నాం కమిటీ సభ్యుడు శ్రీధర్ బాబు అమెరికా వెళ్ళడం, అసెంబ్లీ సమావేశాల వల్ల కమిటీ మీటింగ్స్ అవలేదు జీవో 317 బాధితుల విషయంలో న్యాయం చేయాలని మాకు విల్ పవర్ ఉంది ఎవరో ఏదో చెపితే వాళ్ళ మాటలు విని కంగారు పడకండి

రాహుల్ గాంధీ గారి పై KTR మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తూన్నా చిల్లర రాజకీయాలు మాని హుందాగా వ్యవహరించాలని ktr కు సూచిస్తున్నా, రాష్ట్ర పరిపాలన లో రాహుల్ గాంధీ గారి ప్రస్తావన తేవడం ktr అవివేకానికి నిదర్శనం. అసలు మూసి పై TRS పార్టీ వైఖరిని ప్రశ్నిస్తున్నా అలాగే మూసి బాధితులకు ప్రత్యమ్నాయం చూడకుండా ఒక ఇల్లు కూడా తీయ బొము మరియు కూలగొట్టము పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వీలు అయితే ప్రతిపక్షం బాధ్యత తో నిర్మాణాత్మక సూచనలు చేయాలని కోరుతున్నా .. పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి .

కేటీఆర్ పై కొండా సురేఖ సంచలన ఆరోపణలు.. నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ కారణం హీరోయిన్ ల ఫోన్ ట్యాప్ చేసింది నువ్వే కదా.. హిరో హిన్ల జీవితాలతో అడుకుంది కేటీఆర్.. మత్తు పదార్థాలు అలవాటు చేసింది కేటీఆర్.. దొంగ ఏడుపులు నాకు అవసరం లేదు.. సిగ్గు లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారు.. హరీష్ రావు మనసున్నానిషిగా స్పందించారు.. నివేందుకు రియాక్టు కాలేదు..మనిషివి కాదా..పశువు వా.. నీకు తల్లి లేదా.. మూడు అకౌంట్ లు దుబాయ్ నుండి పోస్టులు పెడుతున్నారు.. మనసుల మధ్య అనుబంధాలు సంబంధ విలువలు ఉన్నాయా ..

వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి CMR టెక్స్టైల్స్ అండ్ జ్యువెల్లర్స్ సంస్థ 25 లక్షల రూపాయల విరాళం అందించింది. CMR డైరెక్టర్ వెంకట రమణ మావూరి గారు, ఇతర ప్రతినిధులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆ మేరకు చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు సీఎంఆర్ ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు.

గాంధీ భవన్ లో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తాము.ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్న ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తాము. ఇప్పటికే 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశాము..డేటా సరిగా లేక పోవడం వలన మిగతా రైతుల రుణమాఫీ కాలేదు..డేటా సరి చేసుకుని మిగతా రైతుల రుణమాఫీ చేస్తాము. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారు. రైతుల గురించి మాట్లాడే అర్హత బీజేపీ కి లేదు. బీజేపీ రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసిందా.. వ్యవసాయ చట్టాలు నల్ల చట్టాలు తీసుకు వచ్చింది మీరు కాదా.. డిల్లి లో రైతులను తొక్కించి చంపింది మీరు కాదా.. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో ఉన్నప్పుడు బంగారం ధర 28,000 ఉంది..మోడీ అధికారం లోకి వచ్చాక లక్ష రూపాయలు అయ్యింది. అయిన తెలంగాణ లో ఉన్న మహిళలు మోడీ కి ఓటు వేసి రాష్ట్రం లో 8 బీజేపీ ఎంపీ సీట్లను గెలిపించారు..ఇన్ని ధరలు పెంచిన మోడీ కి ఎలా ఓట్లు వేస్తున్నారు.. గ్యాస్,బంగారం, పెట్రోల్,డీజిల్ ధరలు పెంచిన వాళ్లకు ఓటు వేయడానికి చేయి ఎలా వస్తుంది… బీజేపీ డ్రామా ఆర్టిస్ట్ లను నమ్మకండి. మేము 18,000 కోట్ల రుణమాఫీ చేసాము. ఎవరైనా వ్యక్తిగత విషయాలు మాట్లాడడం తప్పు.. ఒక ఎంపీ మర్యాదపూర్వకంగా మంత్రికి నూలు దండ వేస్తే brs వాళ్ళు తప్పుడు ప్రచారం ఎలా చేస్తారు. Brs నేతలు brs సోషల్ మీడియా వాళ్ళను మందలించాలి. కెసీఆర్ కేటీఆర్ కు కూడా దండలు వేస్తారు కదా…మీకు కూడా ఆడవాళ్ళు దండలు వేశారు కదా మేము తప్పు పట్టామా. కేటీఆర్,కేటీఆర్ భార్య శైలిమ… హరీష్ రావు.. హరీష్ రావు భార్య ఎడిన సభలో ఎవరైనా దండలు వేస్తే ఎవరైనా మీ లాగే అంటే మీరు ఏమి చేస్తారు.. కొండా సురేఖ కు brs నేతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. దేశాన్ని ఏండ్ల తరబడి రాహుల్ గాంధీ కుటుంభం పాలించారు.. సొంత ఇల్లు లేని వ్యక్తి రాహుల్ గాంధీ..గాంధీ కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రభుత్వం కు ఇచ్చి ప్రభుత్వ బిల్డింగ్ లలో అంటున్నారు. రాహుల్ గాంధీ అమ్మ సోనియా గాంధీ తెలంగాణ ఇస్తేనే మీ నాన్న సీఎం నువ్వు మంత్రి అయ్యావు. రాజకీయాల్లో ఎలా ఉండాలని అనేది మీ నాన్న కెసీఆర్ ను అడిగి తెలుసుకో కేటీఆర్.. రాహుల్ గాంధీ నీ ఇంకొక సారి ఏమైనా అంటే మేము ఊరుకోము..రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు కేటీఆర్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular