Sunday, May 4, 2025

మజ్లిస్‌కు భయపడుతున్న సిఎం రేవంత్‌

  • అం‌దుకే విమోచనోత్సవాలకు దూరం
  • పరేడ్‌ ‌గ్రౌండ్‌ ‌బిజెపి రాజ్య సభ ఎంపి లక్ష్మణ్‌ ‌విమర్శ

‌మజ్లిస్‌ ఒత్తిడికి తలొగ్గి సీఎం రేవంత్‌ ‌రెడ్డి తెలంగాణ విమోచన వేడుకలకు హాజరుకావడం లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ ‌విమర్శించారు. కేంద్రం నిర్వహించే వేడుకలకు ముఖ్యమంత్రి రాకపోవడం విచారకరమన్నారు. సీఎం రేవంత్‌ ‌విమోచన దినమని ఎందుకు పలకట్లేదని ప్రశ్నించారు. ఈ నెల 17న సికింద్రాబాద్‌ ‌పరేడ్‌ ‌గ్రౌండ్‌లో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన వేడుకలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులతో కలిసి ఎంపీ లక్ష్మణ్‌ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..విమోచన వేడులకు సీఎం రేవంత్‌ ‌రెడ్డి రాకపోవడంపై మండిపడ్డారు.

గత మూడేండ్లుగా సెప్టెంబర్‌ 17‌న తెలంగాణ విమోచన వేడుకలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. ఈ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా ముఖ్య అతిథిగా వస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. అయితే హర్యానా, జమ్ముకశ్మీర్‌ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఈ వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ కార్యక్రమానికి చీఫ్‌ ‌గెస్ట్‌గా కిషన్‌రెడ్డితోపాటు సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ ‌షెకావత్‌ ‌పాల్గొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజాపన దినోత్సవం పేరుతో అధికారికంగా వేడుకలను నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ కేంద్ర మంత్రులు అమిత్‌ ‌షా, గజేంద్రసింగ్‌ ‌షెకావత్‌, ‌కిషన్‌ ‌రెడ్డి, బండి సంజయ్‌ని ఆహ్వానించింది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com