సినిమా ఇండస్ట్రీలో ఎంత త్వరగా ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారో అంతే త్వరగా విడిపోయిన జంటలను మనం చూశాము. తిరిగి వాళ్ళు వేరే వేరే వివాహాలు చేసుకుని మళ్ళీ జీవితాన్ని సాగించిన వారు ఉన్నారు. అలాంటి వాళ్ళ లిస్ట్‌లొ మహేష్- నమ్రత కూడా ఉన్నారు.
వినడానికి ఈ విషయం కాస్త వింతగా ఉన్నా ఇది నిజం. మహేష్ – నమ్రతా కూడా ఒకప్పుడు విడిపోయారు. కాకపోతే తిరిగి మళ్ళీ కలుసుకున్నారు. ఈ విషయాన్ని నమ్రతే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
కెరియర్‌లో మహేష్ ఫుల్ ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే నేను కూడా నా తల్లిదండ్రుల్ని కోల్పోయాను. దాంతో మా ఇద్దరి మధ్య కాస్త అభిప్రాయబేధాలొచ్చాయి. కొడుకు గౌతమ్‌ని తీసుకొని నేను ముంబయికి వెళ్ళిపోయాను. కొన్నాళ్ళు విడిపోయాం. కానీ అలా జరగడం చాలా మంచిదైంది. దాంతో మేమిద్దరం ఇంకా చాలా ప్రేమగా ఉంటున్నాం. మా బంధం ఎంత బలమైందో అర్ధమైంది. విడిపోయి తిరిగి కలుసుకున్నాకే సితార పుట్టింది. మహేష్ కోసం నా కెరియర్‌ని కూడా పక్కన పెట్టానన్నారు.
వివాహం తరువాత నటించకూడదని మహేష్ నాకు కండీషన్ పెట్టారని తెలిపారు. కేవలం హీరోయిన్‌గా అనే కాదు ఏ ఆఫీస్‌లో కూడా పని చేయడం మహేష్‌కి ఇష్టం లేదు.