Saturday, December 28, 2024

రామ్‌గోపాల్‌ వర్మ అరెస్ట్‌ తప్పదా?

రామ్‌గోపాల్‌ వర్మ ఈయన చిత్రాలంటే ఒకప్పుడు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ ఉండేది. మరి ఇప్పుడు ఈయన వివాదాల్లో మంచి క్రేజ్‌ని సంపాదిస్తున్నారు. వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు. సినీ ఇండస్ట్రీ.. రాజకీయనాయకులు.. సోషల్‌ మీడియా ఇలా వాళ్ళు వీళ్ళు అని లేకుండా అందరినీ కామెంట్లు చేసుకుంటూ వివాదాలకు తెరలేపుతున్నారు. మరి అలాంటి సంఘటనే ఇప్పుడు వర్మ కొంప ముంచిందని చెప్పాలి.
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ పై తాను తీసిన వ్యూహం చిత్రం ప్రమోషన్ లో భాగంగా సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయనపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో దాఖలైన ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు.. హైదరాబాద్ వెళ్లి మరీ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. “రాం గోపాల్ వర్మకు నోటీసులిచ్చిన ఏపీ పోలీసులు.. ముహూర్తం ఫిక్స్!” మాజీ సీఎం వైఎస్ జగన్ పై గతంలో వ్యూహం చిత్రం తీసిన రాంగోపాల్ వర్మ ప్రమోషన్ లో భాగంగా సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై పెట్టిన పోస్టులు వివాదాస్పదమయ్యాయి. వీరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ అప్పట్లో వర్మ పెట్టిన పోస్టులపై ప్రకాశం జిల్లాలో కేసు నమోదు కావడంతో పోలీసులు ఇవాళ విచారణకు రావాలని నోటీసులు పంపారు. అయితే వర్మ మాత్రం విచారణకు డుమ్మా కొట్టారు. అంతే కాదు తనకు నాలుగు రోజుల సమయం కావాలని పోలీసుల్ని కోరారు. ఇప్పటికే ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించిన రాంగోపాల్ వర్మకు చుక్కెదురైంది. వర్మ అరెస్టు కాకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తేల్చిచెప్పేసింది. అంతే కాదు కావాలంటే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటే విచారిస్తామని కూడా హైకోర్టు తెలిపింది. అయితే వర్మ ఇప్పటివరకూ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోకపోవడం, చివరి నిమిషంలో విచారణకు గైర్హాజరు కావడంతో ఆయన్ను అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వర్మ విజ్ఞప్తిని పోలీసులు అంగీకరిస్తే మాత్రం నాలుగు రోజుల తర్వాత విచారణ జరగనుంది.

 

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com