ముగిసిన విస్తారా కథ
ఎయిర్ ఇండియాలో విలీనం
ఢిల్లీ విమానయాన సంస్థ విస్తారా కథ ముగిసింది. పదేళ్ళు తన సేవలను అందించింన విస్తారా ఇక మీదట కనిపించదు. మంగళవారం నుంచి విస్తారా టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియాలో విలీనం అయింది.
తెలుపు, పర్పుల్ కలర్ విమానాలతో ఇంత కాలం ప్రయాణికలకు సేవలందిచిన విస్తారా ఫ్లైట్స ఇక మీద కనిపించవు. టాటా గ్రూప్ (51%), సింగపూర్ ఎయిర్‌లైన్స్ (49%) సంయుక్తంగా నడిపిన సంస్థే విస్తారా. 2015 దీనిని ప్రారంభించారు. కానీ ఇప్పుడు పదేళ్ళ తర్వాత ఇప్పుడు విస్తారాను.. టాటా గ్రూపుకే చెందిన మరో పెద్ద ఎయిర్ కంపెనీ ఎయిరిండియాతో విలీనం చేశారు. విలీనం తర్వాత కూడా ఇందులో సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంస్థకు 25.1 శాతం వాటా ఉండబోతోంది. ఎయిరిండియాలో విస్తారా విలీనం తరవాత మరో రూ.3,195 కోట్లను సింగపూర్ ఎయిర్‌లైన్స్ పెట్టుబడిగా పెట్టనుంది.
చివరి ఫ్లైట్
విస్తారా ఫ్లైట్ మొదట ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళందో చివరి ఫ్లైట్ కూడా అదే రూట్‌లో ప్రయాణించనుంది. విస్తారాకు చెందిన యూకే 986 విమానం ముంబయి నుంచి ఢిల్లీకి నిన్న రాత్రి 10.50 గంటలకు బయల్దేరి వెళ్ళంది. దీంతోపాటు ఢిల్లీ నుంచి సింగపూర్‌కు వెళ్లాల్సిన యూకే 115 విమానం కూడా రాత్రి 11.45 గంటలకు వెళ్ళింది. సరిగ్గా పదేళ్ళ క్రితం 2015లో జనవరి 9న ప్రారంభమైన విస్తారా తన విమానం సర్వీసును ఢిల్లీ- ముంబయి మధ్యే నడిపారు. ఇప్పుడు ఇవాల్టి నుంచి విస్తారా విమానాలో కోడ్ ‘యూకే’ తెరమరుగై.. ఆ స్థానంలో ఏఐ2XXXX పేరుతో కొత్త కోడ్ వస్తుంది.
విస్తారాకు గుడ్ బై చెప్పిన ప్యాసింజెర్స్
పదేళ్ళు తన సేవలను అందించిన విస్తారాకు ప్రయాణికులు చివరి రోజు ఆ సంస్థకు గ్రాండ్ గా వీడ్కోలు పలికారు. సోషల్ మీడియాలో గుడ్ బై చెబుతూ పోస్టులు పెట్టారు. భారత దేశానికి అత్యంత ఇష్టమైన క్యారియర్లలో ఒకటైన విస్తారాకు కృతజ్ణతలు తెలిపారు. దాంతో పాటూ విస్తారాతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. వారి ప్రయాణ అనుభవాలలో మర్చిపోలేని విషయాలను గుర్తు చేస్తూ.. వారి చివరి ఫ్లైట్ ఫొటోలు , జ్ఞాపకాలు షేర్ చేశారు.