Wednesday, December 25, 2024

హామీల అమలులో కాంగ్రెస్‌ ‌ఘోర వైఫల్యం..

కాంగ్రెస్‌ ‌పార్టీలో ప్రచారం ఫుల్‌.. ‌పనులు మాత్రం నిల్‌.
‌మీడియా సమావేశంలో  కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి

కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్నికలకు ముందు ఇస్తున్న హామీలకు, అధికారంలోకి వొచ్చాక హామీల అమలు విషయంలో.. నక్కకు నాగ లోకానికి  ఉన్న తేడా ఉందని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ ‌రెడ్డి ఎద్దేవా చేశారు. కర్ణాటక, హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌తెలంగాణలో పాలిస్తున్న కాంగ్రెస్‌ ‌పార్టీ హామీల అమలులో సంక్షేమ కార్యక్రమాల అమలులో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. సోమవారం బిజెపి కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  అనేక రకాల వాగ్ధానాలు ఇస్తూ.. ఏ ఒక్క హామీని సరిగ్గా అమలు చేయకుండా అటకెక్కిస్తూ మోసం చేస్తోంది. ఏరు దాటే దాక ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా డిక్లరేషన్లు, గ్యారంటీల, మేనిఫెస్టోల పేరుతో కాంగ్రెస్‌ ‌పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ప్రజలను గారడీ చేసే ఓట్లు దండుకుని మోసం చేసింది.

‌ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి
మెరుగైన ఫర్నిచర్‌, ‌ల్యాబ్స్‌పై ఉపాధ్యాయులు దృష్టి పెట్టాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారన్నా రు. విద్యానగర్‌ ‌జామై ఉస్మానియా పాఠశాలకు కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి బెంచీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు పెరగాలన్నారు. సర్కారు బడుల అభివృద్ధికి సమాజమంతా బాధ్యత తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో అనేక వాగ్దానాలతో కాంగ్రెస్‌ అధికారులోకి వొచ్చిందని డిక్లరేషన్‌, ‌గ్యారంటీల పేరుతో గారడీ చేశారని కిషన్‌ ‌రెడ్డి ధ్వజమెత్తారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com