Tuesday, December 3, 2024

అంతా ప్లాన్ ప్ర‌కార‌మే..! లగచర్ల రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు

వికారాబాద్‌ కలెక్టర్‌పై దాడి ఘటన కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. ఇది ముమ్మాటికీ ప్లాన్ ప్రకారమే దాడి చేసినట్టు అందులో ప్రస్తావించారు.
పక్కా ప్లాన్ ప్రకారమే నిందితులు దాడి చేసినట్లుగా రిమాండ్ రిపోర్ట్‌లో వివ‌రించారు. దాడి కోసం రాళ్లు, కర్రలు, కారంపొడులు ముందే సిద్ధం చేసుకున్నట్లు తేలింది. అధికారులు వచ్చిన వెంటనే దాడి చేయాలని ముందస్తుగానే ప్ర‌ధాన నిందితుడు సురేష్ ప్రణాళిక సిద్ధం చేసినట్లు రిపోర్ట్‌లో తేల్చారు. దాడికి పాల్పడ్డ నిందితులపై సెక్షన్ 61(2),191 (2)(3),132,109,121(1),126 (2),324(4)రెడ్ విత్ 190, సెక్షన్ 3PDPP యాక్ట్, సెక్షన్ 128 బీఎన్ఎస్ఎస్ కింద కేసులు నమోదు చేశారు.

46 మంది నిందితులు
లగచర్ల ఘటన కేసులో 46 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఏ1 గా మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సురేష్‌ను ప్రస్తావించారు. దాడి చేసిన 46 మందిని గుర్తించి, వాళ్లపై వివిధ సెక్షన్-3 కింద కేసులు నమోదు చేశారు. 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ప్రధాన నిందితుడు సురేష్‌తో పాటు మరో 29 మంది ఉన్నారు. భోగముని సురేష్‌రాజ్ కలెక్టర్ వద్దకు వచ్చి సమావేశానికి రైతులు ఎవరూ రారని, మీరే మా గ్రామానికి రావాలని కోరాడు. దీంతో అధికారులు అంతా లగచర్ల గ్రామానికి చేరుకున్నారు. ప్రజాభిప్రాయం కోసం గ్రామంలోకి వెళ్ళిన అధికారులపై ఉద్దేశ పూర్వకం గానే దాడి చేశారని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం అడిషనల్ కలెక్టర్ లింగనాయక్, ఇంచార్జ్ కలెక్టర్ ఉమాశంకర్, దుద్యాల్ తహసిల్దార్ కిషన్ నాయక్ జయకుమార్ కొడంగల్ తహసిల్దార్ విజయనాయక్ వెళ్లారు. ఆ తర్వాత వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, స్పెషల్ ఆఫీసర్ వెంకట్‌రెడ్డి సమావేశానికి వచ్చారు. రైతులతో అధికారులు మాట్లాడటానికి ప్రయత్నిస్తుండగా ఒకేసారి మెరుపు దాడి చేశారు కొందరు. రాళ్లు, కర్రలతో అధికారులను వెంబడించి మరీ దాడి చేశారు. కలెక్టర్ వాహనాన్ని అడ్డగించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రాళ్లు విసిరి, ఆపై దాడికి దిగారు. కడ ఆఫీసర్‌పై మూకుమ్మడిగా రాళ్లు, కర్రలు దాడి చేశారు. ఆ తర్వాత కారంపొడితో విసిరారు. దాని నుంచి తప్పించుకున్న ఆ అధికారి, స్థానిక ప్రైమరీ స్కూల్‌లో తల దాచుకున్నారు. స్కూల్లోకి చొరబడి దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు కాపాడారు. అడిషనల్ కలెక్టర్, కడ స్పెషల్ ఆఫీసర్‌పై హత్యాయత్నం చేశారు. ఈ దాడిలో అధికారులు, పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ విష‌యాల‌న్నింటినీ రిపోర్ట్‌లో పోలీసులు వెల్ల‌డించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular