Tuesday, December 24, 2024

అక్కినేని, మెగా ఫ్యామిలీలో తాళి బంధం..?

టాలీవుడ్ బిగ్ సినిమా ఫ్యామిలీస్ లో మెగా కుటుంబం అలాగే అక్కినేని కుటుంబంల గురించి అందరికీ తెలిసిందే. అయితే టాలీవుడ్ లో మొత్తం నాలుగు టాప్ ఫ్యామిలీస్ ఉంటే వాటిలో ఏ కుటుంబపు హీరో కానీ మరో హీరోతో కలిసి బిగ్ స్క్రీన్ ని షేర్ చేసుకోవడం వంటివి అభిమానులకి ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తూ ఉంటాయి. ఇలా టాలీవుడ్ లో ఒక ఇంట్రెస్టింగ్ కలయిక జరిగింది. అదే మెగా ఫ్యామిలీ నుంచి మెగా డాటర్ నిహారిక కొణిదెల అలాగే అక్కినేని కుటుంబం నుంచి అఖిల్ అక్కినేని కాంబినేషన్. ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ పై గత కొన్ని రోజులుగా ఆసక్తికర వార్తలే వైరల్ గా మారాయి. ఇద్దరూ ఓ సినిమా చేయనున్నారు అని ఇద్దరి నడుమ మంచి రొమాంటిక్ సీక్వెన్స్ లు కూడా ఉన్నాయి అంటూ క్రేజీ రూమర్స్ వచ్చాయి. ఐతే అసలు ఈ స్పెషల్ కాంబినేషన్ పై నిజం బయటకి వచ్చింది. నిహారిక రెండో పెళ్లంటూ అనౌన్స్… వరుసగా పోస్టులు పెడుతున్న మాజీ భర్త!” ఈ కాంబినేషన్ కి జక్కన్న రాజమౌళికి ఉన్న లింక్ ఏంటో కూడా రివీల్ అయ్యింది. తాజాగా వినిపిస్తున్న వార్తలు నిహారిక, అఖిల్ కలిసి నటించనున్నారు అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదట. ఎందుకంటే ఆల్రెడీ వారిద్దరూ కలిసి నటించడం ఎప్పుడో జరిగిపోయింది. అది కూడా సినిమా కోసం కాదు ఒక షార్ట్ ఫిలిం వీరిద్దరూ చేశారట. దీనిని ఎస్ ఎస్ రాజమౌళి కొడుకు ఎస్ ఎస్ కార్తికేయ దర్శకత్వం వహించడం జరిగింది. మెగా డాటర్ నిహారిక ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ అఖిల్ నేను నటించిన షార్ట్ ఫిలిం రిలీజ్ ఆగిపోయింది అని తెలిపింది. తాము నటించిన ఆ చిట్టి చిత్రం మొత్తం అవుట్ పుట్ చూసి రాజమౌళి రిలీజ్ ఆపెయ్యమని చెప్పారట. అనుకున్న రేంజ్ లో అవుట్ పుట్ రాలేదు కనుకే జక్కన్న షార్ట్ ఫిలిం ని రిలీజ్ చెయ్యొద్దని కార్తికేయకి చెప్పారట. సో అలా ఈ ఆసక్తికర కాంబినేషన్ లో షార్ట్ ఫిలిం రిలీజ్ ఆగిపోయిందట. మరి ఈ ఇద్దర్ని కలిపి కార్తికేయ ఎలాంటి కాన్సెప్ట్ అనుకున్నాడో ఎలాంటి సీన్స్ చేసాడో అనేది మాత్రం ఇప్పుడు సస్పెన్స్ గానే మిగిలిపోయింది అని చెప్పాలి. మరి భవిష్యత్తుల వీరిద్దరూ కలిసి మళ్ళీ తిరిగి నటించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా..లేదా ఆల్రెడీ కమిటీ కుర్రాళ్ళు చిత్రంతో మంచి నిర్మాతగా పేరుగాంచిన నిహారిక ఇక నిర్మాతగానే ఉండిపోతుందో వేచి చూడాలి మరి.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com