Wednesday, January 1, 2025

అడ‌విశేష్‌, శృతిహాస‌న్ కాంబోలో మెగా ప్యాన్ ఇండియా చిత్రం

అడ‌వి శేష్‌, శృతిహాస‌న్‌ల కాంబినేష‌న్లో మెగా ప్యాన్ ఇండియా యాక్ష‌న్ డ్రామా తెర‌కెక్క‌నుంది. మేజ‌ర్ త‌ర్వాత అడ‌వి శేష్ బాలీవుడ్‌లో చేస్తున్న రెండో సినిమా ఇది. ఈ సినిమాను సుప్రియా యార్ల‌గ‌డ్డ నిర్మిస్తున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మిత‌మ‌వుతున్న ఈ సినిమాకు ద‌ర్శ‌కుడిగా షానీల్ డియో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌తంలో అడవిశేష్ న‌టించిన క్ష‌ణం, గూడాచారి చిత్రాల‌కు షానీల్ డియో కెమెరామ‌న్‌గా వ్య‌వ‌హ‌రించారు. త‌ను గ‌తంలో తీసిన లైలా షార్ట్ ఫిలిం కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌కు ఎన్నికైంది. కొత్త సినిమాలోని ప్ర‌తి ఫ్రేము, డైలాగ్‌, సీన్‌ను హిందీ మ‌రియు తెలుగులో విడిగి చిత్రీక‌రిస్తార‌ని.. రెండు భిన్న సంస్కృతుల‌కు అనుగుణంగా సినిమాను తెర‌కెక్కిస్తామ‌ని మేక‌ర్స్ తెలిపారు. ఈ సినిమాకు కో ప్రొడ్యూస‌ర్‌గా సునీల్ నారంగ్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమాపై మ‌రిన్ని వివ‌రాలు అతిత్వ‌ర‌లో తెలుస్తాయి.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com