సీనియర్ నటి, మాజీ మంత్రి రోజా మరోసారి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్టు స్వయంగా వెల్లడించింది. పైగా ఈసారి ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటుందో ఎగ్జాంపుల్స్ తో సహా తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మరి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుందంటే రోజా రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టే అని స్పష్టమవుతున్నది.
ఒకానొక టైంలో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలను ఓ ఊపు ఊపేసిన రోజా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి, బాలయ్య, నాగ్, వెంకటేష్, జగపతిబాబు, రాజశేఖర్ లాంటి స్టార్ హీరోలతో నటించి తిరుగులేని హీరోయిన్ గా ఎదిగింది. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నగరి ఎమ్మెల్యేగా టిడిపి నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయింది. ఆ తర్వాత వైసిపిలో ఎమ్మెల్యేగా గెలిచింది. ఇక 2017 ఇచ్చి శంభో శివ శంభో, గోలీమార్, మొగుడు, శ్రీరామరాజ్యం, పరమవీరచక్ర వంటి సినిమాల్లో నటించింది. ఎమ్మెల్యే అయ్యాక సినిమాలు మానేసి, ‘జబర్దస్త్’ కామెడీ షోకు ఎనిమిదేళ్లు జడ్జ్ గా ఆకట్టుకుంది. అనంతరం మంత్రిగా కూడా పని చేసిన రోజా గత ఎన్నికల్లో ఓడిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆమె రీఎంట్రీకి ప్లాన్ చేస్తోంది.
గత కొంతకాలం నుంచి రోజా మీడియాకి దూరంగా ఉంటూ వస్తుంది. అలాగే ఇంటర్వ్యూలు కూడా ఇవ్వట్లేదు. అయితే ఇప్పుడిప్పుడే ఆమె పబ్లిక్ లోకి రావడం చూసి రోజా సినిమాల్లో మరోసారి రీఎంట్రీ ఇవ్వడం ఖాయమని వార్తలు వినిపించాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై రోజా క్లారిటీ ఇచ్చారు. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ ‘మళ్ళీ సినిమాలోకి రావాలనుకుంటున్నారా ?’ అని ప్రశ్నించారు. దానిపై స్పందిస్తూ రోజా ఇప్పుడు సినిమాలపై ఫోకస్ చేస్తున్నానని, రీ ఎంట్రీ కోసం ప్లాన్ చేస్తున్నానని వెల్లడించింది. అయితే ఈసారి హుందాగా, పవర్ ఫుల్ గా ఉండే పాత్రలు మాత్రమే చేయాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది రోజా. ‘బాహుబలి’ సినిమాలో రమ్యకృష్ణ, ‘అత్తారింటికి దారేది’ మూవీలో నదియా, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో విజయశాంతి చేసినటువంటి రోల్స్ చేయాలని ఉందని తన మనసులోని మాటను బయట పెట్టింది.
అలాగే తన నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తూనే సినిమాలు కూడా చేయాలనుకుంటున్నానని ఈ సందర్భంగా రోజా చెప్పుకొచ్చింది. ఈ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ప్రస్తావన రాగా, చిన్నప్పుడు చెర్రీని ఎత్తుకొని పెంచానని గుర్తు చేసుకుంది రోజా. ముఠామేస్త్రి షూటింగ్ సమయంలో ఊటీకి వచ్చిన రామ్ చరణ్ చాలా అల్లరి చేశాడని, స్కూల్ కి వెళ్ళాక అల్లరి తగ్గిందని చెప్పుకొచ్చింది. అలాగే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూశాక చాలా గర్వంగా అనిపించిందని, రామ్ చరణ్ డాన్స్ లో వాళ్ళ నాన్న కనిపిస్తాడని చెప్పుకొచ్చింది. రోజా చిరంజీవికి పెద్ద ఫ్యాన్. కాకపోతే రాజకీయాల పరంగా ఇద్దరికీ మధ్య గ్యాప్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పాలిటిక్స్ లో భాగంగా రోజా చిరంజీవిపై చేసిన కామెంట్స్ వల్ల రామ్ చరణ్ ఆమె మీద పీకల్లోతు కోపంలో ఉన్నాడని, ఆమె ఉంటే అసలు సినిమాలో యాక్ట్ చెయ్యను అని అన్నాడని టాక్ నడిచింది.