Friday, November 15, 2024

అరెస్టా.. హ‌డావుడా… తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్!

లగచర్లలో కలెక్టర్ పై దాడి కుట్రలో కేటీఆర్ పాత్ర ఉందని పట్నం నరేందర్ రెడ్డి అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. దీంతో బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్ర‌భుత్వ వ‌ర్గాల టాక్‌. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ కు భారీ ఎత్తున చేరుకుంటున్నారు. నిజానికి, బుధ‌వారం సాయంత్రం నుంచే కేటీఆర్‌.. గులాబీ కార్య‌క‌ర్త‌ల ర‌క్ష‌ణ‌లో ఉంటున్నారు. బుధ‌వారం రాత్రి దాదాపుగా 100 మందికిపైగా కార్య‌క‌ర్త‌లు కేటీఆర్ ఇంటి ద‌గ్గ‌రే జాగారం చేశారు. ఉద‌యం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్‌కు రావ‌డంతో.. అక్క‌డకు కార్య‌క‌ర్త‌లు వ‌చ్చారు.

మ‌రోవైపు లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటనలో కేటీఆర్ అరెస్టుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. నేడే కేటీఆర్‌ను అరెస్టు ఉండొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ఉండడంతో బీఆర్ఎస్ వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ నేతలు భారీగా చేరుకుంటున్నారు. లగచర్ల కుట్రలో కేటీఆర్ పాత్ర ఉందంటూ రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ పాత్రను అంగీకరించారని ప్రకటించారు.

ప‌ది రోజులుగా ఇదే ప్రచారం
ఫార్ములా-ఈ రేసులో అవకతవకల వ్యవహారంలో కేటీఆర్ అరెస్ట్ ఉంటుందన్న ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది. అయితే కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఈ అంశంపై ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. దీంతో ప్రభుత్వం గవర్నర్ కు లేఖ రాసింది. అయితే.. లేఖ రాసి 15 రోజులైనా గవర్నర్ నుంచి ప్రభుత్వానికి అనుమతి రాలేదు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డితో సహా ముఖ్య నేతలు బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. ఆ రెండు పార్టీల కుమ్మక్కు కారణంగానే బీఆర్ఎస్, బీజేపీ పెద్దల ద్వారా గవర్నర్ పై ఒత్తిడి తెస్తోందంటూ ఆరోపిస్తున్నారు. అయితే.. కలెక్టర్ పై దాడి కేసులో అనుమతి అవసరం లేదు. కేవలం స్పీకర్ కు సమాచారం ఇస్తే సరిపోతుంది. దీంతో ఏ క్షణమైనా కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.
మ‌రోవైపు తన అరెస్ట్ వార్తలపై కేటీఆర్ గురువారం ఉదయం స్పందించారు. తనను ఏదో ఒక కేసులో రేవంత్ రెడ్డి ఇరికించి అరెస్ట్ చేస్తాడని ఎప్పుడో తెలుసన్నారు. రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా జైలుకు పోతానన్నారు. రేవంత్ కుట్రలకు భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular