గ్రేటర్ హైదరాబాద్ లో కొన్ని రోజులుగా అమలవుతున్న నిషేధాజ్ఞలను సడలిస్తూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. సచివాలయ పరిసరాల్లో తప్ప నగరంలోని ఇతర ప్రాంతాల్లో శాంతియుతంగా పోలీసుల అనుమతితో నిరసనలు, ధర్నాలు చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఇటీవల పలు పరిస్థితుల నేపథ్యంలో సచివాలయం, అసెంబ్లీతో పాటు గవర్నర్ బంగ్లా దగ్గర కఠినంగా ఆంక్షలు విధించారు. దీంతో పాటుగా నగరమంతా 144 సెక్షన్ అమలు చేశారు. అయితే, మంగళవారం నుంచి సచివాలయం మినహా మిగిలిన ప్రాంతాల్లో ఆంక్షలను సడలించారు.