Tuesday, December 31, 2024

ఎంత తాగుతారో తాగండి

బీర్ల ఉత్ప‌త్తి పెంపున‌కు స‌ర్కారు ఆదేశాలు

రాష్ట్రంలో మందుబాబుల కోసం ప్ర‌భుత్వం ప‌క్కా ప్ర‌ణాళిక వేసింది. తాగినోళ్లకు తాగినంత మందు అందుబాటులో పెట్టాల‌ని ఆదేశించింది. వచ్చే ఎండకాలం లో బీర్ల కొరత లేకుండా రేవంత్‌ సర్కార్‌ ఇప్పటి నుంచే చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఎక్క‌డా.. ఏ వైన్ షాపులో కూడా నో స్టాక్ బోర్డులు కనిపించకుండా జాగ్రత్త పడాలని బేవరేజెస్ కంపెనీలకు ఎక్సైజ్ శాఖ ఆదేశాలిచ్చింది. ప్ర‌ధానంగా బీర్ల ఉత్ప‌త్తి పెంపున‌కు ఆదేశాలిచ్చింది. దీనికోసం స‌రిప‌డా నీటిని సైతం కేటాయించాల‌ని ఆదేశించారు. వీటితో పాటుగా కొత్త కంపెనీల బీర్లు కూడా రానున్నాయి. దీంతో ఈసారి ఎండాకాలం ఫుష్ జోష్ అన్న‌ట్టే.
రేవంత్‌ సర్కార్‌ తెలంగాణలోని మందుబాబులకు ఎగిరిగంతేసే వార్త ఒకటి చెప్పింది. ఇప్పటికే తెలంగాణలో మద్యం ధరలు పెంచుతారంటూ మందుబాబులను టెన్షన్ పెడుతూ.. పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్న వేళ.. ఎక్సైజ్ శాఖ మంచి కిక్‌ ఇచ్చే వార్త వినిపించింది. ధరల విషయంతో పాటు వచ్చే సీజన్‌కు లిక్కర్ ప్రొడక్షన్ విషయంలో ఎక్సైజ్ శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సీజన్‌కు సరిపడా మద్యం నిల్వలను సిద్ధంగా ఉంచిన ప్రభుత్వం.. వచ్చే వేసవి కోసం కూడా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటుంది.

నో స్టాక్ బోర్డులు క‌నిపించ‌వ్‌
అసలే వచ్చేది వేసవి కావటంతో మందుబాబులు చల్లచల్లని బీర్ల కోసం వైన్ షాపులకు పరుగులు తీస్తారనే సంగతి తెలిసిందే. గడిచిన వేసవిలో సరిపడా బీర్ల కొర‌త‌తో వైన్ షాపులలో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇవ్వటంతో మద్యంప్రియులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా బీర్ల కొరత కొట్టొచ్చినట్టు కనిపించింది. ఈ క్రమంలోనే కొన్ని ప్రత్యేక బ్రాండ్లకు సంబంధించిన బీర్లు అందుబాటులో ఉంచాలంటూ కొంత మంది ప్రభుత్వానికి లేఖలు రాయటం, తమదైన శైలిలో డిమాండ్లు చేయటం క‌నిపించింది. ఇలాంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో గత వేసవి అనుభవాలను పరిగణలోకి తీసుకున్న ఎక్సైజ్ శాఖ.. వచ్చే ఎండాకాలంలో బీర్ల కొరతలేకుండా ముందు నుంచే చర్యలు తీసుకుంటుంది . వచ్చే వేసవిలో ఎలాంటి బీర్ల కొరత లేకుండా సరిపడినంత స్టాక్ అందుబాటులో ఉంచాలని బేవరేజెస్ కంపెనీలకు రేవంత్ సర్కార్ ఇప్పుడే ఆదేశాలు జారీ చేసింది. బేవరేజెస్ కంపెనీలు నెల రోజులుగా బీర్ల ఉత్పత్తి ని పెంచినట్లు లెక్కలు చెబుతున్నాయి. సంగారెడ్డి సమీపంలో ఉన్న ఓ కంపెనీలో సాధారణంగా నెలకు 3 నుంచి 4 లక్షల కేసుల బీర్లు ఉత్పత్తి అవుతుండగా.. ప్రస్తుతం ఆ సంఖ్యను 5 లక్షలకు పెంచి సరఫరా చేస్తుంది. కేవలం సంగారెడ్డిలో ఉన్న ఒక్క కంపెనీ మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు కంపెనీలు బీర్ల ఉత్పత్తిని పెంచినట్టు టాక్‌. ఎక్సైజ్ శాఖ ఆదేశాల మేరకు ఉత్పత్తిని పెంచిన బేవరేజెస్ కంపెనీలు వచ్చే సమ్మర్ సీజన్‌లో మందుబాబులకు కిక్కెక్కించేందుకు ఇప్పటి నుంచే చర్యలు మొదలు పెట్టాయి. ఫలితంగా.. వచ్చే వేసవికి సరిపడా స్టాక్ అందుబాటులో ఉండనుంది. గత వేసవిలో లాగా వైన్ షాపుల్లో చిల్డ్ బీర్లు లేకుండా నో స్టాక్ బోర్డులు కనిపించే అవకాశం ఉండదని బేవరేజెస్ కంపెనీలు అనుకుంటున్నాయి. మరోవైపు గత కొన్ని రోజులుగా తెలంగాణలో మద్యం ధరలను భారీగా పెంచనున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని మందుబాబుల ముందు పెట్టేందుకు రెడీ అయ్యింది. మద్యం ధరలు పెంచే ఆలోచనపై కాకుండా అమ్మకాలపైన దృష్టి పెట్టాలని సూచించారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com