Sunday, October 6, 2024

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈనెల 8న విచారణ

రాష్ట్రంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణను జూలై 8కి హైకోర్టు వాయిదా వేసింది. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద, కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్లు వేశారు. . ఎమ్మెల్యేలు దానం నాగేదందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై స్పీకర్ అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్ లో కోరారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పులున్నా పరిగణలోకి తీసుకోవడంలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. అయితే బుధవారం విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular