Saturday, December 28, 2024

ఎ.ఆర్‌. రెహమాన్‌ దంపతుల విడాకులు

సినీ సెలబ్రిటీల విడాకులు అనేవి చాలా సర్వ సాధారణం అయిపోయింది. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. వాళ్ళ వైవాహిక జీవితం ఎన్నేళ్ళు ఏంటి అన్న విషయం కూడా ఆలోచించకుండా విడిపోతున్నారు. వివాహ బంధానికి విలువే లేకుండా పోతుంది. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం..ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక , కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. తెలుగులో నాగచైతన్య-సమంత, పవన్ కల్యాణ్ – రేణు దేశాయ్, డైరెక్టర్ క్రిష్, చిరంజీవి కూతురు శ్రీజ, నాగబాబు కూతురు నిహారిక ఇలా చాలామంది తెలుగు సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. తమిళంలో కమల్ హాసన్ , ధనుష్, వంటి వారితో పాటు, బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్లు సైతం తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా చేరారు. ఏఆర్ రెహమాన్ భార్య సైరా బాను తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. మంగళవారం రాత్రి, ఆమె ఏఆర్ రెహమాన్ నుండి విడిపోతున్నట్లు ధృవీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తమ మధ్య సయోధ్య చేయలేని దూరం పెరిగిపోయిందని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని సైరా బాను తన ప్రకటనలో చెప్పుకొచ్చారు. ఏఆర్ రెహమాన్‌కు ఆయన భార్య విడాకులు ఇవ్వడంపై సినీ వర్గాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి. అయితే వీరు విడాకులు తీసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com