Monday, May 12, 2025

ఏఐసిసి అగ్ర నాయకులతో సిఎం, డిప్యూటీ సిఎం భేటీ

వరంగల్ సభతో పాటు పలు అంశాలపై చర్చ
సిఎం రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీకి ఆదివారం బయలుదేరి వెళ్లారు. ఆదివారం ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సిఎం ఢిల్లీకి వెళ్లారు. ఇప్పటికే ఢిల్లీ పర్యటనలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఉండగా వారితో కలిసి సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ అయినట్టుగా తెలిసింది. ఈనేపథ్యంలోనే ఆయన ఏఐసిసి నేతలతో పలు అంశాలను చర్చించినట్టుగా సమాచారం.

రాష్ట్రంలో చేపట్టిన రైతు రుణమాఫీ అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానంకు సిఎం రేవంత్ రెడ్డి వివరించినట్టుగా తెలిసింది. దీంతోపాటు నూతన పిసిసి అధ్యక్షుడి ఎంపిక, కేబినెట్ విస్తరణపై కూడా ఏఐసిసితో చర్చించినట్టుగా సమాచారం. మరోవైపు వరంగల్‌లో ‘రైతు కృతజ్ఞత’ సమావేశానికి రాహుల్ గాంధీని రావాలని ఆహ్వానించినట్టుగా సమాచారం.

ఈ నేపథ్యంలోనే రైతు కృతజ్ఞత సభ తేదీ ఈ రెండు రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే నేడు సిఎం రేవంత్ తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు. ఆదివారం సాయంత్రం సిఎం రేవంత్ ఢిల్లీలోని తన నివాసంలో ఇరిగేషన్ అధికారులతో సమావేశమై వారికి పలు సూచనలు జారీ చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com