Wednesday, December 25, 2024

ఏఖంగా బ్రిటన్‌ బ్యూటీతోనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు – జక్కన్న కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్‌ కి నాంది పలికారన్న విషయం తెలిసిందే. అదే SSMB 29గా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ భారీ బడ్డెట్ మూవీ ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తరువాత రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడం, ఇందులో సూపర్ స్థార్ మహేష్ బాబు హీరోగా నటించడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట్లో వైరలవుతోంది. ఈ మూవీలో హాలీవుడ్ బ్యూటీ, ఇంగ్లీష్ యాక్టర్స్ ప్రధాన పాత్రలో నటించబోతుందట. ఇంతకీ ఆ హాలీవుడ్ బ్యూటీ ఎవరా అని అందరూ ఆలోచిస్తున్నారు. మహేష్‌బాబు గుంటూరుకారం కాస్త నెగిటివ్‌ టాక్‌ తెచ్చుకునేసరికి కొంత నిరాశకి గురయ్యారు మన సూపర్‌స్టార్‌. ఈ క్రమంలో మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ ప్రకటన రావడంతో అందరి చూపు ఈ మూవీపై పడింది. ప్రస్తుతం SSMB 29 భారీ బడ్డెట్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ లో రాజమౌళి బిజీబిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ లోకేషన్స్ కోసం రాజమౌళి కెన్యా దేశంలోని అంబోసెలీ నేష‌న‌ల్ పార్క్‌ను సంద‌ర్శించిన విషయం తెలిసిందే. “SSMB 29: రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు జీరో రెమ్యునరేషన్… కానీ ఓ ట్విస్టు!” హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కబోతున్న ఈ మూవీ ( SSMB 29 )కోసం ప్రిన్స్ మహేశ్ బాబు కూడా తెగ కష్టపడుతున్నట్టు తెలుస్తోంది.మహేశ్ బాబు కంప్లీట్‌గా మేకోవర్ అవుతున్నారు. రాజమౌళి మూవీ కోసం మహేశ్ బాబు లాంగ్ హెయిర్, గడ్డంతో కనిపించారు. దీంతో అచ్చు హాలీవుడ్ హీరోలా ఉన్నాడ్రా బాబు.. అంటూ ప్రిన్స్ ఫ్యాన్స్ తెగ సంబురపడిపోతున్నారు. అడ్వెంచర్ థ్రిలర్ గా రాబోతున్న ఈ సినిమా కోసం రూ. 1000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారట. ఈ భారీ బడ్జెట్ మూవీకి ప్రధాన నిర్మాతగా శ్రీ దుర్గా ఆర్ట్స్ డాక్టర్ కెఎల్ నారాయణ వ్యవహరించనున్నారట. 18 శతాబ్దం నాటి కథగా తెరకెక్కించబోతున్న ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం అడవుల్లో జరగబోతుందని సమాచారం. ఇదో ఫారెస్ట్ ఎడ్వెంచర్ మూవీ అని టాక్. ఈ పాన్ వరల్డ్ మూవీలో బ్రిటీష్ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ బ్రిటీష్ ముద్దుగుమ్మ. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. హలీవుడ్ హీరోయిన్ నవోమి స్కాట్‌‌ ( Naomi Scott). ఈ SSMB29 సినిమా కోసం ఇంగ్లాండ్ భామ నవోమి స్కాట్‌ని రాజమౌళి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూవీ మేకర్స్ నవోమి స్కాట్‌‌తో చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. అందుకే ఈ బ్యూటీని రాజమౌళి కొడుకు కార్తికేయ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నాడని వార్తలు వస్తున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com