కేసీఆర్ గైడ్‌లైన్స్ తోనే…!
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కవిత జైలులోనే ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పడి నెల తిరగకముందే ఆయన విమర్శలు చేయడం పార్టీకి నెగిటివీటీని తెచ్చిపెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతి పథకంలో బొక్కలు వెతకడం.. ఏ పని ముందేసుకున్నా ప్రెస్ మీట్ పెట్టి విమర్శించడంతో కేటీఆర్ పై ప్రజలకే కాకుండా సొంతపార్టీ నేతలకు సైతం విసుగు వచ్చింది. ఇదే సమయంలో కేటీఆర్‌కు సంబంధించిన కొన్ని కేసులు కూడా బయటకు రావడం, వాటిని సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో ఫెయిల్ కావడంతో పార్టీ వర్గాలు సైతం కొంత ఆయోమయంలో పడుతున్నాయి. మరోవైపు కేటీఆర్ వ్యవహారంపై కూడా సీనియర్లు కొందరు కేసీఆర్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ల కారణంగానే తాము ఓడిపోయామని ఆయన చెప్పడంతో పాటూ ఇప్పుడు కేవలం సోషల్ మీడియానే నమ్ముకుని రాజకీయాలు చేయడం ఆ పార్టీ నేతలకు సైతం నచ్చడం లేదు. ఇక లోక్ సభ ఎన్నికల సమయంలో ఉద్యమ పార్టీకి ఘోరపరాభవం కలగటానికి కూడా ఆయనే కారణమని విమర్శలు వచ్చాయి. కేటీఆర్ కు అర్బన్ కు, రూరల్ కు తేడా తెలియదని బీఆర్ఎస్ సోషల్ మీడియా బహిరంగంగా కామెంట్లు చేసింది. కేటీఆర్ హైదరాబాద్ లో ఇచ్చిన స్పీచ్ నే ఆదిలాబాద్ లో ఇచ్చి విమర్శలపాలయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాభవం తరవాత కూడా ఆయన తీరు మారలేదు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ తీరుగానే వ్యవహరిస్తున్నారు. దీని ఫలితంగా పార్టీకి చాలా మంది సీనియర్లు దూరం అయ్యారు. జిల్లాలు, గ్రామస్థాయిలోనూ బీఆర్ఎస్ చాలా మంది కార్యకర్తలను కోల్పోవాల్సి వచ్చింది.
కవిత.. నువ్వు చూసుకో
పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ కొడుకు కేటీఆర్ ను కాకుండా కవితను ముందుంచి రాజకీయాలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నేతలు చెబుతుననారు. ఈ నేఫథ్యంలోనే జైలుకు వెళ్లొచ్చిన గ్యాప్ లో కేసీఆర్ కూతురుకు రాజకీయ పాఠాలు భోదించారని గతంలో నుంచి ప్రచారం జరుగుతున్నదే. అంతే కాకుండా కవితను మందుంచి రాజకీయాలు చేసేందుకు త్వరలోనే పార్టీలో కీలక పదవి అప్పగించబోతున్నట్టు ప్రచారం జరగుతోంది. గతంలో బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలిగా గుండు సుధారాణి వ్యవహించిన సంగతి తెలిసిందే. ఆమె పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. చాలా కాలం నుండి బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలి స్థానం ఖాళీగానే ఉంది. ఇప్పుడు ఆ స్థానంలో కవితను నియమించబోతున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే కవిత పార్టీలో మరింత కీలకంగా మారే అవకాశం ఉంది. అంతే కాకుండా ఇప్పటికే కేటీఆర్ పై పార్టీలో వ్యతిరేకత నెలకొనగా కవిత జాగ్రత్తగా వ్యవహరిస్తే కేసీఆర్ తరవాత తానే కీలకంగా మారే అవకాశాలు సైతం ఉన్నాయి.