Sunday, December 29, 2024

కుటుంబ సమేతంగా చూడదగ్గ ‘జాతర’… నిర్మాత శివశంకర్ రెడ్డి

సతీష్ బాబు రాటకొండ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘జాతర’. దీయా రాజ్ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రాన్ని గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మించారు. ఇంత వరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్‌తో రగ్డ్‌గా, ఇంటెన్స్ డ్రామాతో ‘జాతర’ తెరకెక్కింది. చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్‌లో జరిగే జాతర నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 8న థియేటర్లోకి రాబోతోంది. ఈ క్రమంలో నిర్మాత శివ శంకర్ రెడ్డి చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

* సాయి కుమార్, వినోద్ కుమార్ కాంబోలో ఇది వరకు ఓ సినిమాను నిర్మించాను. నాకు సినిమాలంటే చాలా ఇష్టం. ఈ క్రమంలో నా స్నేహితుడు సతీష్ చెప్పిన ఓ పాయింట్ చాలా నచ్చింది. అదే జాతర కథ. సతీష్ బాబు ఈ జాతర కథను యథార్థ సంఘటనల ఆధారంగా రాసుకున్నారు. నాకు కథ చాలా నచ్చింది. అందుకే సినిమాను నిర్మించాను.

* చిత్తూరు జిల్లాలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథను సతీష్ బాబు రాశారు. 18 గ్రామాలకు కాపు కాసే దేవత.. చుట్టూ ఈ కథ తిరుగుతుంది. విజువల్ వండర్‌గా ఈ సినిమా ఉంటుంది. టెక్నికల్‌గా హై స్టాండర్డ్‌లో ఈ మూవీ ఉంటుంది. ప్రసాద్ కెమెరా వర్క్ అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. సీజీ వర్క్ కూడా చక్కగా కుదిరింది. ప్రణవ్ అందించిన పాటలు, ఇచ్చిన ఆర్ఆర్ సినిమాకు ప్రాణంగా నిలుస్తుంది.

* జాతర చిత్రాన్ని మూడు షెడ్యూల్స్‌లో 73 రోజుల పాటు చిత్రీకరించాం. షూటింగ్ చేసినన్ని రోజులు వర్షం పడుతూనే వచ్చింది. కానీ ఎప్పుడూ షూటింగ్‌కు ఆటంకం కలగలేదు. అదంతా కూడా పాలేటమ్మ మహిమ అని నేను నమ్ముతాను. మాకు ఎక్కడా కూడా అంతరాయం కలగలేదు.

* జాతర చిత్రానికి అందరూ కొత్త వాళ్లే పని చేశారు. టెక్నికల్ టీం కూడా కొత్తదే. కానీ చాలా అనుభవం ఉన్నవాళ్లు తీసిన చిత్రంలా ఉంటుంది. అందరూ ప్రాణం పెట్టి ఈ జాతర కోసం పని చేశారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా తెరకెక్కించాం. మా చిత్రంలో ఎక్కడా కూడా అసభ్యత అనేది ఉండదు.

* సెన్సార్ వాళ్లు ఎక్కడా మాకు కట్స్ చెప్పలేదు. సినిమా అంతా ఒకెత్తు అయితే.. చివరి 20 నిమిషాలు ఇంకో ఎత్తు అని ప్రశంసించారు. అందరూ చూడదగ్గ చిత్రాన్ని తీశామని అన్నారు. ప్రీమియర్ల నుంచి కూడా మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

* సతీష్ గారు ఈ చిత్రానికి దర్శకుడిగా, హీరోగా న్యాయం చేశారు. సతీష్ బాబు కథ చెప్పిన తరువాత ఆయన దర్శకత్వం చేయడమే కరెక్ట్ అనిపించింది. హీరోగా కూడా ఆయన అయితేనే బాగుంటుందని అనుకున్నాం. ఆయన జాతర చిత్రాన్ని అద్భుతంగా తీశారు. అద్భుతంగా నటించారు.

* జాతర అనే చిత్రం అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. ఎక్కడా చిన్న చిత్రం అన్నట్టుగా ఉండదు. చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి సబ్జెక్ట్‌తో సినిమా రాలేదు. అందరినీ ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుంది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com