Wednesday, January 8, 2025

ACB notice to KTR కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు

బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విచారణకు రాకపోవడంతో మళ్లీ నోటీసులు ఇవ్వాలని ఏసీబీ నిర్ణయించినట్లు సమాచారం. నోటీసులు ఇచ్చి విచారించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని కేటీఆర్‌ ‌కోరుతున్నారు.

ఇప్పటికే కేటీఆర్‌ ‌క్వాష్‌ ‌పిటిషన్‌ ‌తీర్పును హైకోర్టు రిజర్వ్ ‌చేసింది. ఫార్ములా-ఈ కార్‌ ‌రేస్‌ ‌వ్యవహారంలో కేటీఆర్‌పై కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కక్ష పూరితంగా అక్రమకేసు బనాయించిన విషయం తెలిసిందే. విచారణ నిమిత్తం రావాలంటూ ఏసీబీ అధికారులు కేటీఆర్‌కు నోటీలు జారీచేశారు. ఇందులో భాగంగా న్యాయవాదులతో కలిసి ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకుముందు నందినగర్‌లోని తన నివాసంలో న్యాయవాదులతో చర్చించారు. అనంతరం వారితో కలిసి ఏసీబీ ఆఫీస్‌కు బయల్దేరారు.

అయితే ఏసీబీ కార్యాలయం వద్ద కేటీఆర్‌ ‌కారును పోలీసులు అడ్డుకున్నారు. లీగల్‌ ‌టీమ్‌కు అనుమతి లేదంటూ నిలిపివేశారు. వారిని దించిన తర్వాతే ఆఫీస్‌లోకి రావాలన్నారు. అయితే లీగల్‌ ‌టీమ్‌ ఉం‌టే అభ్యంతరం ఏంటంటూ ప్రశ్నించారు. న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరగాలన్నారు. పోలీసులపై నమ్మకం లేదు కాబట్టే లాయర్లతో వచ్చానన్నారు. లీగల్‌ ‌టీమ్‌తో రావద్దని నోటీసుల్లో ఉందా, ఉంటే చూపించాలని పోలీసు అధికారులను ప్రశ్నించారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com