Monday, April 7, 2025

క్యాన్సర్ తో పోరాడుతున్న అభిమాని ఆకాంక్ష నెరవేర్చిన చంద్రబాబు

తనను కలవాలని ఆరాటపడిన ఓ అభిమాని ఆకాంక్షను తీర్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. క్యాన్సర్‌తో పోరాడుతూ చివరి ఘడియల్లో ఉన్న ఓ అభిమాని చంద్రబాబునుు కలిసి ఫోటో దిగాలని చాలా కాలంగా కోరుకుంటున్నాడు. రేణిగుంటకు చెందిన 30 ఏళ్ల సురేంద్రబాబు జీవితంలో ఒక్కసారైనా చంద్రబాబును కలవాలన్న ఆకాంక్షను స్థానిక నాయకుల ద్వారా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌ రెడ్డికి తెలిపారు.

ఆయన ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి పర్యటన ముగించుకుని శనివారం రేణిగుంటలో ఎయిర్ పోర్ట్ లో విమానం ఎక్కేందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి వాహనం దిగి వచ్చి సురేంద్రబాబును కలిసి ఫోటో దిగారు. క్యాన్సర్ తో బాధపడుతున్న సురేంద్రబాబుకు వైద్య చికిత్స కోసం 5 లక్షల చెక్కును అందజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తన అభిమాన నాయకుడిని కలవడంతో అతడి సంతోషానికి అవధులు లేవని చెప్పాలి. ఇక సురేంద్ర బాబు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com