తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలను టీజీపీఎస్సీ(తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ప్రకటించింది. ఈ మేరకు ఏప్రిల్ 16, 17, 19, 21 తేదీల్లో నాంపల్లిలో గల సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీలో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని వెల్లడించింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితా ఉంటుందని కమిషన్ తెలిపింది. ఎంపికైన అభ్యర్థులు వారికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్‌కు హాజరవ్వాలని సూచించింది.