Saturday, December 28, 2024

చెన్నై వైల్డ్ ఫైర్ పుష్ప 2

సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న భారీ బడ్జెట్ చిత్రం పుష్ప 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా రష్మిక మందన్న కథానాయకగా 2021లో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఎంతో పెద్ద విజయం సాధించిన ‘పుష్ప ది రైజ్’ సినిమాకు సీక్వెల్ గా ‘పుష్ప ది రూల్’ రానుంది. సుమారు మూడు సంవత్సరాల తర్వాత రానున్న ఈ సీక్వెల్ పై ప్రేక్షకులకు, అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ అలాగే పాటలు ఎంతో బజ్ తెప్పించాయి. ఇటీవలే పాట్నాలో టైలర్ లంచ్ చేయడం జరిగింది. దేశంలోనే అతిపెద్ద ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గా సుమారు మూడు లక్షల మందికి పైగా హాజరవుతూ ఈవెంట్ నిలిచింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ… “ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నమస్కారం. తమిళ ప్రజలందరికీ నా నమస్కారాలు. జీవితంలో నేను మర్చిపోలేని రోజుగా ఈరోజును నేను గుర్తుపెట్టుకుంటాను. నేను సుమారు 20 ఏళ్లుగా సినిమా చేస్తున్నాను. సినిమాలకు ప్రమోషన్లు చేస్తుంటాము. ప్రత్యేకంగా పుష్పాకు అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ రావడంతో దేశంలో తిరుగుతూ ప్రమోషన్ చేస్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా కూడా చెన్నైకి వచ్చినప్పుడు వచ్చే ఫీల్ వేరు. చెన్నై తో నాకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. నా తొలి 20 ఏళ్ల జీవితాన్ని చెన్నైలో నేను గడిపాను. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నారా, ఫైర్ అనుకుంటున్నారా, వైల్డ్ ఫైర్’. డిసెంబర్ 5తేదీన ప్రపంచవ్యాప్తంగా మీ ముందుకు రాబోతున్నాను. నా జీవితంలో అంత వైల్డ్ గా ఇంకా ఎప్పుడు పని చేసి ఉండను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క అతిధికి పేరుపేరునా నా ధన్యవాదాలు. నేను ఎంతగానో ఇష్టపడి చెన్నైలో ఈ ఫంక్షన్ పెట్టాలని అనుకున్నాను. నేను ఇప్పుడు కచ్చితంగా తమిళ్ లోనే మాట్లాడడానికి కారణం ఏంటంటే నేను ఈ మట్టికి ఇచ్చే గౌరవం అది. నేను దుబాయ్ కి వెళ్ళినప్పుడు అరబిక్ లో మాట్లాడాలి, కేరళ వెళ్ళినప్పుడు మలయాళంలో మాట్లాడాలి, హిందీ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు హిందీలో మాట్లాడాలి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు తెలుగులో మాట్లాడాలి అనుకుంటాను. అది నేను ఆ నేలకి ఇచ్చే గౌరవంగా భావిస్తాను. మైత్రి మూవీస్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాను మీరు కాకుండా ఇంకా ఎవరు చేయగలిగే వారు కాదు. మమ్మల్ని ఇంతగా నమ్మి సపోర్ట్ చేసినందుకు చాలా థాంక్స్. నా చిన్ననాటి స్నేహితుడు దేవిశ్రీ ప్రసాద్ మంచి ప్రత్యేకంగా చెప్పాలి. నాకు ఎన్నో సినిమాలలో ఎంతో మంచి హిట్స్ ఇచ్చాడు. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నాతో ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న ప్రతి నటీనటులకు నన్ను కృతజ్ఞుణ్ణి. అలాగే ప్రత్యేకంగా రష్మిక గురించి చెప్పాలి. గత నాలుగు సంవత్సరాలుగా నాతో ఈ సినిమా కోసం పని చేస్తూ నన్ను ఇంతగా సపోర్ట్ చేసినందుకు రష్మికకు థాంక్స్. అలాగే స్పెషల్ గెస్ట్ సాంగ్ చేసిన శ్రీలీల చాలా కష్టపడే మనిషి. ఈ చిత్రంలో సాంగ్ డాన్స్ చాలా బాగా చేసింది. అది మీరు స్క్రీన్పై చూస్తే అర్థమవుతుంది. ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ కు నా ప్రత్యేక ధన్యవాదాలు. తమిళనాడులో ఈ సినిమాను మీరు డిస్ట్రిబ్యూట్ చేయడం ఎంతో సంతోషకరంగా ఉంది. నేను ఇద్దరి గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఒకటి సుకుమార్. దర్శకుడు సుకుమార్ లేకపోతే పుష్ప అనే సినిమా లేదు. తనతో కలిసి ఆర్య సినిమా చేయకపోతే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. ఒక్కసారి ఆ సినిమా నేను చేసిన తర్వాత వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. నా జీవితంలో అంత ఇంపాక్ట్ కలిగించిన ఒకే ఒక్క మనిషి పేరు చెప్పాలి అంటే అది కచ్చితంగా సుకుమార్ మాత్రమే. ఆయన చాలా సిన్సియర్ డైరెక్టర్. సౌండ్ మిక్సింగ్, ఎడిటింగ్, ఎఫెక్ట్స్ అంటూ ప్రతి విషయంలోనూ చాలా క్లియర్ గా సుకుమార్ ఉంటారు. ఇక రెండవది నా ఫ్యాన్స్ గురించి మాట్లాడాలి. నేను వారిని ఫాన్స్ గా కాదు ఆర్మీ అని పిలుచుకుంటాను. మీరంటే నాకు పిచ్చి. మిమ్మల్నికపై ఇంతగా వీక్షించి దంచుకోలేదు. ఇకనుండి ఎక్కువ సినిమాలు చేస్తూ ఉంటాను. నేను కచ్చితంగా మీ అందరి అంచనాలను ఈ డిసెంబర్ 5వ తేదీన రీచ్ అవుతాం అనుకుంటున్నాను. నేను మాట్లాడిన వాటిలో ఏమైనా తప్పిదాలు ఉంటే నన్ను క్షమించమని కోరుకుంటున్నాను. చిన్నపాటి తప్పులు ఉన్నా కూడా నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను భాషను గౌరవించే వ్యక్తిని. నన్ను మీరు క్షమిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఏంటో నాకు తెలుసు. అలాగే మీ అంత మంచి యాంకర్ ను నేను ఇంతవరకు చూడలేదు. చాలా బాగా ఈవెంట్ ను హోస్ట్ చేశారు. మీ ప్రేమకు, మీ అభిమానానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ఈ నేలకు మరొకసారి నా ధన్యవాదాలు” అన్నారు.

 

ఈ సందర్భంగా ఏజెఎస్ ఎంటర్టైన్మెంట్స్ అర్చన కల్పాతి గారు మాట్లాడుతూ… “ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, పుష్పా టీంకు, ప్రేక్షకులకు అందరికీ ఏజెఎస్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ తరఫున నమస్కారం. ఏజిఎస్ ను నమ్మి ఇంత గొప్ప సినిమాను మాకు ఇచ్చినందుకుగాను నవీన్ గారికి,రవి గారికి ధన్యవాదాలు. ఇంత పెద్ద సినిమాను తమిళనాడులో మా ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నాము. సుమారు 600 స్క్రీన్స్ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నాము. మొదటి రోజున 3500 షోలు వేయనున్నాము. నాకు దర్శకుడు సుకుమార్ గారు అంటే ఎంతో అభిమానం. ఆయన సినిమాలు, వాటిలో ఆయన ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసే విధానం నాకు ఎంతగానో నచ్చుతుంది. అల్లు అర్జున్ గారు, రష్మిక మందన్న గారి పర్ఫామెన్స్ నాకు చాలా బాగా నచ్చుతాయి. దేవిశ్రీ ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా సబ్ డిస్ట్రిబ్యూటర్స్ కు, డిస్ట్రిబ్యూటర్ హెడ్లకు ధన్యవాదాలు. డిసెంబర్ 5వ తేదీన ఈ జీవితాన్ని తప్పకుండా చూడండి” అన్నారు.

మైత్రి మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ మాట్లాడుతూ… “పుష్ప టీం తరఫున ఇక్కడికి వచ్చి ఈ ఈవెంట్ ను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీడియా మిత్రులకు అలాగే ఏజీఎస్ నిర్మాతలకు, నెల్సన్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. గత రెండు సంవత్సరాలకు చిత్ర బృందం ఈ సినిమాను పూర్తి చేయడానికి గనుక ఎంతగానో కష్టపడుతూ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి అన్ని అంశాలు పెద్దవే. అలాగే చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ వారి పూర్తిస్థాయిలో పర్ఫామెన్స్ ఇవ్వడం జరిగింది. పుష్ప 1తో ఫైర్ మొదలు పెట్టి పుష్ప 2తో వైల్డ్ ఫైర్ వచ్చేలా చేశారు. అల్లు అర్జున్ డిసెంబర్ 5 నుండి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రూల్ చేస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే జాతీయ అవార్డును సొంతం చేసుకున్న అల్లు అర్జున్, ఈ సినిమాతో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంటారు. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా ధన్యవాదాలు. దర్శకుడు సుకుమార్ తో మేము ఇప్పటికే మూడు చిత్రాలకు కలిసి పని చేసాము. ఆయన ఎంతో మిషనరీ ఉన్న దర్శకుడు. ఆయనతో పనిచేయడం మాకు సంతోషకరం. సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు అలాగే ఈ చిత్ర బంధం అందరితో పని చేయడం మాకు సంతోషకరం. దేశంలోనే అతిపెద్ద సినిమాను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకువెళ్లి వెళ్తున్నందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. పుష్ప 1, పుష్ప 2 చేసాము. పుష్ప 3 చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. డిసెంబర్ 2 తేదీన తప్పక పుష్ప 2 చిత్రాన్ని థియేటర్లో అందరూ చూడాలి” అన్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ గారు మాట్లాడుతూ… “ఇంతటి ఆదరణ ఇచ్చిన చెన్నై ప్రజలకు నా ధన్యవాదాలు. చెర్రీ గారు చెప్పినట్లు ఇది చాలా పెద్ద సినిమా. ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొచ్చినందుకు మేము ఎంతో ఆనంద పడుతున్నాము. డిసెంబర్ 5వ తేదీన ఈ చిత్రం మీ ముందుకు రానుంది. తమిళనాడులో విచిత్రంతో గొప్ప విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాము. త్వరలోనే తమిళనాడులో కూడా మేము సినిమాలు నిర్మించనున్నాము. మొదటి సినిమా అజిత్ గారితో గుడ్ బ్యాడ్ అగ్లీ చేస్తున్నాము. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా సుమారు షూటింగ్ అంతా అయిపోయింది. మరొక 7రోజుల షూటింగ్ మాత్రమే ఉంది. తమిళ్ లో మా తొలి చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ కచ్చితంగా పెద్ద ఎత్తు కొడుతుందని మేము నమ్ముతున్నాము. త్వరలోనే చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తాము. మీ సపోర్ట్ మాకు కావాలి. మేము సుకుమార్ గారి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పినా మాకు అద్భుతంగానే అనిపించింది. మేము సుకుమార్ గారిని ఎంతగానో నమ్ముతాము. మాకు ఆయన పైన చాలా నమ్మకం ఉంది. భవిష్యత్తులో కూడా ఆయనతో సినిమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము” అన్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి గారు మాట్లాడుతూ… “చెర్రీ గారు, నవీన్ గారు చెప్పినట్లే మేము ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నాము. నాకు చాలా మంచి టీం ఉంది. ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. డిసెంబర్ 5న ఖచ్చితంగా పుష్ప 2 చిత్రాన్ని చూడండి” అన్నారు.

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. మీ అందరిని ఇలా చూడటం నాకు ఎంత సంతోషంగా ఉంది. పుష్ప 2 సినిమా విడుదలకు ముందే ఇంత ఆదరణ రావడం చాలా ఆనందాన్నిస్తుంది. దానికి గాను అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ చిత్రంలో సాంగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తదితరు అంశాలు అన్ని చాలా బాగా వచ్చాయి. అది నాకు, నా చిన్ననాటి స్నేహితుడు అల్లు అర్జున్ కు చాలా ప్లస్గా నిలిచాయి. అలాగే చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కు నా ధన్యవాదాలు. పుష్ప నాకు మరింత స్పెషల్ సినిమా. పుష్ప 2 కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తుంది. దర్శకుడు సుకుమార్ గారికి నా ధన్యవాదాలు. ఆయన ఫైనల్ మిక్సింగ్ లో ఉన్నారు. అందుకే ఆయన రాలేకపోయారు. చిత్రం చాలా బాగా రావడం జరిగింది. కచ్చితంగా అందర్నీ మెపిస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నట విశ్వరూపం చూడబోతున్నాం. ఈ చిత్రం కోసం అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ ఎంతగానో కష్టపడ్డారు. త్వరలోనే మరొక పాట రాబోతుంది. ఆ పాటలో అల్లు అర్జున్ మాస్ డాన్స్ చూడబోతున్నారు. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అతిధికి పేరుపేరునా ధన్యవాదాలు. డిసెంబర్ 5వ తేదీన సినిమాను తప్పకుండా చూడండి” అన్నారు.

దర్శకుడు నెల్సన్ మాట్లాడుతూ… “ముందుగా నన్ను ఆహ్వానించినందుకు చాలా థాంక్స్. నాకు పుష్ప 1 భయంకరంగా నచ్చేసింది. అప్పటి నుండి పుష్పా2 ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తున్నాను. అల్లు అర్జున్ గారి స్క్రీన్ ప్రజెంన్స్, స్టైల్ నాకు చాలా ఇష్టం. సినిమాల పట్ల ఎంతో ప్యాషన్ ఉంటే గానీ ఇలా చేయలేరు. దేశంలోనే ఎంతో ఎదురు చూస్తున్న సినిమాగా పుష్ప 2 వినిపిస్తుంది. తమిళనాడులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ ఆల్ ది బెస్ట్. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కు ఆల్ ది బెస్ట్. శ్రీలీల డ్యాన్స్ & పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తుంది. అల్లు అర్జున్ గారి బుట్ట బొమ్మ పాటలో డాన్స్ చూసి ఇంకా ఎవరు ఆయనలా ఈ పాటకు డ్యాన్స్ వేయలేరు అనిపించింది. సుకుమార్ గారి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం కోసం అందరిలానే నేను కూడా ఎంతగానో వేచి చూస్తున్నాను. డిసెంబర్ 5న తేదీన కలిసి తప్పకుండా ఈ సినిమాని చూద్దాం” అన్నారు.

ఆదిత్య రామ్ గ్రూప్ చైర్మన్ ఆదిత్య రామ్ గారు మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. పుష్ప 1 అంతటి విజయం సాధించడం చూసిన తర్వాత పుష్ప 2 కచ్చితంగా మరింత విజయం సాధిస్తుందని తెలుస్తుంది. నేను సినిమాలు చాలా తక్కువగా చూస్తాను. కానీ పుష్పా సినిమాను రిపీటెడ్ గా చాలాసార్లు చూడడం జరిగింది. ఆ సినిమా నాకు అంతగా నచ్చింది. ఆ చిత్రంలో నటీనటుల నటనగాని, మ్యూజిక్ గాని ప్రతిదీ నాకు చాలా బాగా నచ్చాయి. పుష్ప టు ఇండస్ట్రీ రికార్డులను రూల్ చేస్తుందని ఆశిస్తూ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. చిత్ర నిర్మాతలకు, క్యాస్ట్ & క్రూకు ఆల్ ది బెస్ట్” అన్నారు.

కలైపులి దాను గారు మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. అల్లు అర్జున్ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ మాత్రమే కాదు, యావత్ భారతదేశంలోనే అద్భుతమైన నటుడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం వింటూనే ఉన్నాము. ఆయన పాటలు కచ్చితంగా మంచి కొడతాయి. ఈజీఎస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఈ పుష్ప 2 చిత్రం కచ్చితంగా భారీ విజయాన్ని సాధిస్తుంది. మరొకసారి ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు” అన్నారు.

నటి శ్రీలీల మాట్లాడుతూ… “ఇక్కడికి వచ్చి ఇంత ప్రేమగా ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. చెన్నైలో నా పాట లాంచ్ చేయడానికి వచ్చిన నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు నాకు మాటలు రావడం లేదు. నిజంగా నాకు అంత సంతోషంగా ఉంది. బన్నీ గారికి స్పెషల్ థాంక్స్. మీతో కలిసి డాన్స్ చేసే ఛాన్స్ రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీతో డాన్స్ చేయడం ఎలా అని అనుకున్నాను కానీ మీరు చాలా సింపుల్ గా ఉండటం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. మీ నుండి నేను ఎంతో నేర్చుకున్నాను. రష్మిక గురించి చెప్పాలంటే ఎలా చెప్పాలో తెలియడం లేదు. సెట్స్ లో ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. ఇప్పుడు మేము చాలా క్లోజ్ అయిపోయాము. దేవిశ్రీ ప్రసాద్ గారికి నా ధన్యవాదాలు. నన్ను నమ్మి నాకు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు సుకుమార్ గారికి చాలా థాంక్స్” అన్నారు.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న మాట్లాడుతూ… “ఇంత ప్రేమను అందిస్తున్న మీ అందరికీ నా నమస్కారం. రెండే మాటల్లో నేను చెప్పాలనుకుంటున్నాను. నా జీవితం పుష్పకు ముందు, పుష్ప కు తర్వాత అన్నట్లుగా ఈ సినిమాతో మారిపోయింది. ఏడేళ్ల నా సినీ కెరియర్లో ఐదేళ్లు పుష్పా సినిమాతో పనిచేశాను. ఈ చిత్ర బృందం నాకు ఎంతో స్పెషల్. అల్లు అర్జున్ గారు నా జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తిగా నిలిచిపోయారు. అందరూ కలిసి డిసెంబర్ 5వ తేదీన పుష్ప సినిమాని థియేటర్లో కచ్చితంగా చూడండి. నాకు మీరు, మీ అభిమానం అంటే చాలా ఇష్టం” అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com