Friday, November 15, 2024

జగనన్న క్షమించు.. లోకేష్‌ అన్న వదిలేయ్‌- శ్రీరెడ్డి

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేము. అదే విధంగా ఎప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియదు కాబట్టి ఎవ్వరైనా సరే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. కాని రాజకీయాల్లో అలా ఉండదు ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉంటే వారికి సంబంధించిన వారు ప్రతిపక్షంపైన రెచ్చిపోవడం అనేది సర్వసాధారణం. ఇది కేవలం రాజకీయ నాయకులు మాత్రుమే కాదు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేనివాళ్ళు కూడా సోషల్‌ మీడియా పుణ్యమాంటు ఎవరికి నచ్చినట్టు వారు భావస్వేచ్ఛ.. వాక్‌స్వాతంత్ర్యం అనే పదాలతో ఇష్టమొచ్చినట్లు రెచ్చిపోవడం నేడు సొసైటీలో చాలా కామన్‌ అయిపోయింది. ప్రస్తుతం అదే విధంగా…ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ హయాంలో విపక్ష కూటమి నేతలపై వీడియోలతో నిత్యం చెలరేగిపోయిన ఆ పార్టీ సానుభూతిపరురాలు శ్రీరెడ్డికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వైసీపీ సోషల్ మీడియా నేతల్ని వరుసగా అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో శ్రీరెడ్డి అరెస్టు కూడా తప్పదనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే ఆమెపై అనకాపల్లితో పాటు రాజమండ్రిలో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో మంత్రి నారా లోకేష్ తో పాటు వైసీపీ అధినేత జగన్ కు ఆమె రెండు లేఖలు రాశారు. ఆ లేఖల్లో జగనన్న నేను పార్టీకి పార్టీ నేతలకి దూరంగా ఉంటాను నన్ను క్షమించండి అంటూ జగన్‌కు లేఖ అదే విధంగా లోకేష్‌ అన్న నాది విజయవాడ మన ప్రాంతానికి సంబంధించిన చాలా మంది కార్యకర్తలు నా స్నేహితులుగా ఉన్నారు. నేను ఎవ్వరిని ఉద్దేశించి బాధపెట్టలేదు. దయచేసి నన్ను క్షమించండి మీ తెలుగమ్మాయిని కాపాడండి అంటూ లేఖ రాశారు.

శ్రీరెడ్డి వీడియో…
నేను శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ఒక వీడియోని షేర్‌ చేసింది. నారా లోకేష్, పవన్ కళ్యాణ్, వంగలపూడి అనితకు, వారి కుటుంబ సభ్యులకు సారీ చెప్తున్నట్లు శ్రీరెడ్డి తెలిపారు. తన కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్న ఆలోచనతోనే ఇలా సారీ చెప్తున్నట్లు తెలిపారు. ఇకపై వారి జోలికి రానని చెప్పేశారు. తాను ఎంత పెద్ద తప్పు చేసిందో ఇప్పుడు అర్ధమవుతుందని ఎంతమంది మనోభావాలతో ఆడుకున్నానో ఇప్పుడు తెలుస్తుందని వీడియోలో పేర్కొంది. అయితే ప్రభుత్వం మాత్రం ఆమె వ్యవహారాన్ని వదిలిపెట్టేలా కనిపించడం లేదు. శ్రీరెడ్డి గతంలో తన వ్యాఖ్యలపై సారీ చెప్పినా ఇతర వైసీపీ కార్యకర్తల తరహాలోనే ఆమెపైనా చర్యలు తీసుకునేలా కనిపిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular