Friday, December 27, 2024

టెర్రిఫైయింగ్ ఫస్ట్ లుక్ “భైరవం”

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పవర్ ఫుల్ “భైరవం” టైటిల్ తో రూపొందుతున్న మూవీ ఫస్ట్ లుక్ లో టెర్రిఫిక్ గా కనిపించారు. ఈ ఫస్ట్ లుక్ ఆయన్ని రగ్గడ్ అండ్ రస్టిక్ గా ప్రజెంట్ చేసింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న దేవాలయం, ప్రజలు కాగడాలు పట్టుకొని వుండటం పోస్టర్‌కు మరింత ఇంటెన్స్ ని యాడ్ చేస్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపిస్తారని ఫస్ట్ లుక్ పోస్టర్ సూచించింది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కెకె రాధామోహన్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పెన్ స్టూడియోస్‌ డాక్టర్ జయంతిలాల్ గడ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. నియో-నోయిర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ నంబర్ 16కి పవర్ ఫుల్ ‘భైరవం’ అనే టైటిల్ పెట్టారు. టైటిల్ డిజైన్ విశేషంగా ఆకట్టుకుంది. భైరవంలో ప్రముఖ తారాగణం, సాంకేతిక సిబ్బంది ఉన్నారు. మనోజ్ మంచు, నారా రోహిత్ ల ఫస్ట్ లుక్ పోస్టర్లు ఒకదాని తర్వాత ఒకటి త్వరలో విడుదల కానున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com