Sunday, December 29, 2024

డార్లింగ్‌ ‘టిపికల్‌’గా సెట్‌ అయ్యేనా?

అమ్మాయిల కలల రాకుమారుడు డార్లింగ్‌ ప్రభాస్‌ వరుస చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్‌’, హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా సెట్స్‌పై ఉన్నాయి. ఈ రెండు చిత్రాల చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. మరోపక్క ‘కల్కి -2’, ‘సలార్‌-2 చిత్రాల పనులు కూడా జరుగుతున్నాయి. సందీప్‌రెడ్డి వంగాతో ప్రభాస్‌ చేసే స్పిరిట్‌ చిత్రం కూడా త్వరలో సెట్స్‌ మీదకెళ్లనుందని ఇటీవల దర్శకుడు ఓ వేదికపై చెప్పారు. భూషణ్‌కుమార్‌ నిర్మించనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. డిసెంబరు నెలాఖరున ప్రారంభం కానుంది. దీంట్లో ప్రభాస్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే! దీనికి సంబంధించిన లుక్‌ ఇప్పటికే ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఇందులో ‘యానిమల్‌’లోని రణ్‌బీర్‌ పాత్ర తరహాలో మరో రెండు కొత్త లుక్స్‌లోనూ అలరించే అవకాశమున్నట్లు సమాచారం. వచ్చే నెలలో సినిమాని లాంఛనంగా ప్రారంభించి.. జనవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెడతారు. అక్కడి నుంచి ఆరు నెలల్లోనే సినిమాని పూర్తి చేయనున్నట్లు చిత్ర నిర్మాత ఇటీవల వెల్లడించారు. . దీన్ని బట్టి ఇది వచ్చే ఏడాదిలోనే తెరపైకి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి హర్షవర్థన్‌ రామేశ్వర్‌ సంగీత దర్శకుడు. మరి ఎప్పుడూ చేయని డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో ప్రభాస్‌ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. యానిమల్‌లో రణ్‌బీర్‌ పాత్ర కాస్త టిపికల్‌గా ఉంటుంది. అలాంటి పాత్రకి ప్రభాస్‌ ఫిట్‌ అవుతాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ప్రభాస్‌ ఏ విధంగా ఉండబోతున్నాడో లుక్‌ రిలీజ్‌ అయితేగాని చెప్పలేము.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com