Saturday, December 28, 2024

డిప్యూటీసీఎంతో జక్కన్న… అసలు విషయం ఇదా?

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్‌కి ఊహించని హైప్‌ వస్తుంది. మరి అలాంటి ఒక కాంబినేషనే పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ దర్శకధీరుడు రాజమౌళి ఒకటి అని చెప్పాలి. పవన్ పీక్ క్రేజ్ కి రాజమౌళి లాంటి పక్కా కమర్షియల్ దర్శకుడు సినిమా పడితే బాక్సాఫీస్ ఊచకోత ఊహించని లెవెల్లో ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ పడాలి అని ఎప్పటి నుంచో అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. కానీ ఇది అందని ద్రాక్ష లానే మిగిలిపోయింది. ఒకప్పుడు రాజమౌళి పవన్ తో సినిమా చేసేందుకు ప్రయత్నించాను కానీ కుదరలేదు అని కూడా చెప్పుకొచ్చాడు. పైగా రాజమౌళి తండ్రి గ్లోబల్ సెన్సేషనల్ ఆర్ ఆర్ ఆర్ సృష్టికర్త పవన్ ఇమేజ్ ని మ్యాచ్ చేసే కథని నేను రాసుకోలేనని అంత అపారమైన క్రేజ్ పవన్ సొంతం అని తాను చెప్పుకొచ్చారు.. అసలు విషయం లీక్ చేసిన విజయేంద్ర ప్రసాద్!” అంతే కాకుండా తన మరో ఎపిక్ బాహుబలి 2 లో ఇంటర్వెల్ సీక్వెన్స్ కి ప్రేరణ కూడా పవన్ కళ్యాణే అని విజయేంద్ర ప్రసాద్ సెలవిచ్చారు. మరి వీరి కలయికలో సినిమా చేయకుండానే ఓ రేంజ్ ఎలివేషన్ లు అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి డెప్యూటీ సీఎం సాబ్ ని కలవడం అనే ఒక విజువల్ క్రేజీ థింగ్ గా మారిపోయింది. పవన్, రాజమౌళి పై ఓ పిక్ ఇద్దరు ఒకరినొకరు ఆప్యాయంగా పిలుచుకొని చేతితో చేయి పట్టుకొని నవ్వుతూ మాట్లాడుతున్న దృశ్యాలు కొన్ని బయటకి వచ్చాయి. అయితే ఇది అంతా చూడ్డానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉంది కానీ ఇది సినిమా కోసం అయితే కాదు. ఇటీవల కాలం చేసిన ప్రముఖులు రామోజీరావు స్మరణ సభకి వీరు అథిధులుగా రాగా అక్కడ ఒకరినొకరు కలుసుకొని పలకరించుకున్నారు. అలా ఈ ఊహించని కలయిక సాధ్యపడింది. మరి సినిమా లాంటివి ఏమన్నా ఉన్నాయో లేదో కాలమే నిర్ణయించాలి.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com