Thursday, November 14, 2024

తొలిపోరుకు సిద్ధం జార్ఖండ్‌లో మొద‌టి విడుత పోలింగ్

జార్ఖండ్‌‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటలకు ఇక్కడ పోలింగ్ ఆరంభం కానుంది. పోలింగ్ సవ్యంగా సాగడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటోన్నారు. మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి జార్ఖండ్‌లో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 44. ప్రస్తుతం ఇక్కడ ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా అధికారంలో ఉంది. జార్ఖండ్ ముక్తి మోర్చా-కాంగ్రెస్- వామపక్షాల ప్రభుత్వానికి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నాయకత్వాన్ని వహిస్తోన్నారు.
నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతలుగా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ, ఇండియా కూటమి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి జేఎంఎం-కాంగ్రెస్- వామపక్షాలు ఈ సారి అధికారంలోకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరాలని ఎన్డీఏ ప్రయత్నాలు సాగిస్తోన్నాయి. మొత్తంగా 2.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారిలో 1.31 కోట్ల మంది పురుషులు, 1.29 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కాగా 11.84 లక్షల మంది తొలిసారిగా ఓటు వేయనున్నారు. వీరిలో యువ ఓటర్ల సంఖ్య 66.84 లక్షలు.

నేడు తొలిద‌శ‌
తొలి దశలో 43 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగనుంది. జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ సహా మొత్తం 683 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు. వీరిలో 73 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. తొలి విడతలో 15, 344 మంది పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది ఈసీ. ఈ విడతలో మొత్తం 1,36,85,508 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 68,65,207 మంది పురుషులు, 68,20,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ విడతలో మెజారిటీ సీట్లను దక్కించుకోవడానికి జేఎంఎం- కాంగ్రెస్, బీజేపీ సంకీర్ణ కూటమి పార్టీలు హోరాహోరీగా ప్రచార పర్వాన్ని సాగించాయి. బీజేపీ నుంచి దినేషానంద్ గోస్వామి (బహరాగోరా), బాబూలాల్ సోరెన్ (ఘట్‌శిల), పూర్ణిమా సాహు (జంషెడ్‌పూర్ ఈస్ట్), చంపై సోరెన్ (సరైకేలా), గీతా గోరా (జగన్నాథ్‌పూర్), సుదర్శన్ భగత్ (గుమ్లా), మీనా ముండా (పొట్కా) వంటి అభ్యర్థులు తొలి విడతలో బరిలో నిలిచారు. జార్ఖండ్ ముక్తి మోర్చా నుంచి రామ్‌దాస్ సోరెన్ (ఘట్‌శిల), బైద్యనాథ్ రామ్ (లతెహర్) దీపక్ బారువా (చాయ్‌బాసా), మిథిలేష్ కుమార్ ఠాకూర్ (గర్హ్వా), మహువా మాఝీ (రాంచీ) వంటి హేమాహేమీలు తొలి విడత పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే వారిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి డాక్టర్ అజొయ్ కుమార్ (జంషెడ్ పూర్ ఈస్ట్), రామేశ్వర్ ఓరమ్ (లోహర్‌దాగా), జేడీయూ అభ్యర్థి సరయూ రాయ్ (జంషెడ్‌పూర్ వెస్ట్) బరిలో ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular