Monday, May 19, 2025

త్రిషతో లోకనాయకుడి శృతి మించిన రొమాన్స్‌

లోక నాయకుడు కమల్ హాసన్ నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. కమల్ హాసన్ తన కెరీర్‌లో ఎన్నో విభిన్న పాత్రలను పోషించారు. హీరోగా, విలన్‌గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారాయన. ఈతరం నటుల్లో కమల్ హాసన్ మాదిరిగా విభిన్న పాత్రల్లో నటించే హీరోలు లేరంటే అతిశేయోక్తి కాదు. ఇదే సమయంలో దశావతారం సినిమాలో 10 పాత్రల్లో కనిపించి చరిత్ర సృష్టించారు. నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా ఇలా విభిన్న పాత్రల్లో కమల్ హాసన్ సేవలు అందించారు. అయితే గత కొంతకాలంగా కమల్ హాసన్ నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోవడం లేదు. విక్రమ్ తర్వాత కమల్ నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ‘థగ్ ఆఫ్ లైఫ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించారు. కమల్‌తో పాటు శింబు కూడా మరో హీరోగా ఈ సినిమాలో నటిస్తున్నారు. త్రిష,అభిరామి హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. గ్యాంగ్‌స్టర్ బ్యాగ్రౌండ్‌తో వస్తున్న సినిమాలో యాక్షన్ ఎంతుందో.. రొమాన్స్ కూడా అదే రేంజ్‌లో ఉంది. ముఖ్యంగా కమల్ హీరోయిన్లతో రొమాన్స్ చేసినట్టు ట్రైలర్‌లో చూపించారు. అభిరామితో లిప్ కిస్ సీన్ అయితే ట్రైలర్‌కే హైలెట్‌గా నిలిచింది. అలాగే త్రిషతో సైతం రొమాన్స్ సీన్లు ఉన్నట్టు ట్రైలర్‌ను చూస్తుంటే అర్థం అవుతుంది. ట్రైలర్ బాగున్నప్పటికీ, కమల్ చేసిన రొమాన్స్ గురించే ఎక్కువ చర్చ సాగుతుంది. 70 ఏళ్ల వయస్సులో లిప్‌లాక్ సీన్లు అవసరమా అంటూ నెటిజన్లు కమల్ హాసన్‌‌ను ప్రశ్నిస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com