Saturday, April 5, 2025

ధర్నా చేసే నైతిక హక్కు బిజెపికి లేదు

  • ఎమ్మెల్యే హరీశ్ రావు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు
  • కిసాన్ కాంగ్రెస్ నేత కోదండ రెడ్డి

మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, రుణమాఫీ చేయడం కెటిఆర్‌కు, హరీశ్‌రావులకు ఇష్టం ఉందా లేదా..? అన్నది చెప్పాలని కిసాన్ కాంగ్రెస్ నేత కోదండరెడ్డి డిమాండ్ చేశారు. మూడు విడతల్లో రూ.31 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశామని, ఒక్కో రైతుకు రూ. రెండు లక్షల రుణం వరకు మాఫీ అయిందని ఆయన పేర్కొన్నారు.

శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎప్పుడూ రైతుల పక్షమేనని ఆయన అన్నారు. 2018లో రూ.20,480 కోట్ల రుణమాఫీ చేస్తామని అప్పటి సిఎం కెసిఆర్ చెప్పారని, కేవలం రూ.13,300 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని ఆయన గుర్తు చేశారు.

కెసిఆర్ రుణమాఫీ ప్రక్రియను ఆలస్యం చేయడంతో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. అర్హులైన రైతులకు రుణమాఫీ కాకపోతే జిల్లాల్లో నోడల్ ఆఫీసర్‌కు దరఖాస్తు పెట్టు కోవాలని కోదండరెడ్డి సూచించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాల కారణంగా 700 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు.

బిజెపి చేసిన చట్టాలు ఏనాడు వ్యవసాయానికి గురించి లేవని, కేవలం బడా పారిశ్రామిక వేత్తల కోసమే బిజెపి తాపత్రయ పడుతోందని ఆయన ఆరోపించారు. బిజెపి నేతలు అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్థూపం వద్ద ధర్నా చేసే నైతిక హక్కు లేదని కోదండరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com