Saturday, December 28, 2024

నట జీవితానికి మరోమెట్టు “సిటాడెల్ – హనీ బన్నీ” వెబ్ సిరీస్ -హీరో యష్ పూరి

చెప్పాలని ఉంది, అలనాటి సిత్రాలు, శాకుంతలం,హ్యాపీ ఎండింగ్ వంటి సినిమాలతో టాలెంటెడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు యష్ పూరి. ఆయన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో దర్శకద్వయం రాజ్ అండ్ డీకే రూపొందించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ రీసెంట్ గా అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చి సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ సిరీస్ లో ఓ కీలక పాత్రను పోషించారు యంగ్ హీరో యష్ పూరి.
సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ లో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని…ఈ సిరీస్ తన నట జీవితంలో మరో మెట్టు పైకి తీసుకెళ్లందని యష్ పూరి సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన రైటర్ సీతాకు, తనకు సపోర్ట్ చేసిన నటి సమంత మరియు దర్శకులు రాజ్ డీకేకు తన కృతజ్ఞతలు తెలిపారు. సమంత, వరుణ్ లాంటి పవర్ హౌస్ పర్ ఫార్మర్స్ తో కలిసి నటించే అవకాశం రావడం తన కెరీర్ లో మర్చిపోలేనని యష్ పూరి తన పోస్ట్ లో తెలిపారు. త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్ చేసుకుంటున్నారీ యంగ్ హీరో.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com