Saturday, December 28, 2024

నిన్ను వ‌దిలేదే లేదు

తెలంగాణ‌లో ఆర్ ఆర్ ట్యాక్స్‌
అమృత్ ప‌థ‌కంలో అవినీతి
ఢిల్లీలో కేటీఆర్ సవాల్

అమృత్ పథకం అవినీతి జ‌రిగింద‌ని, అక్ర‌మ మార్గంలో టెండ‌ర్లు కట్ట‌బెట్టార‌ని కేంద్రానికి బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిర్యాదు చేశారు. మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మనోహర్ లాల్ కట్టర్‌ను కలిసిన కేటీఆర్.. ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.ఈ సంద‌ర్భంగా ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ క్రోనీ క్యాపటలిజం, అవినీతి గురించి మాట్లాడుతున్నారని, కొందరు పారిశ్రామికవేత్తలు అధికారవర్గానికి దగ్గరగా ఉండి లక్షల కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపిస్తున్నారని, కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో సరిగ్గా ఇలాగే జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలా మారిందని ప్రధాని అన్నారని చెప్పారు. అలాగే తెలంగాణలో ఆర్ ఆర్‌ (రాహుల్-రేవంత్) ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మండిప‌డ్డారు. ‘‘నేను ఆధారాలు తీసుకొచ్చి మీకు అందించాను. అయినా సరే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.

బంధువుల కోసం
సీఎం రేవంత్ రెడ్డి వందల కోట్ల రూపాయల కాంట్రాక్ట్‌ను తన సొంత బామ్మర్దికి అప్పగించారని కేటీఆర్ విమ‌ర్శించారు. రేవంత్ రెడ్డి తన సొంత బామ్మర్దికి అమృత్ పంచి, అల్లుడి కోసం కొడంగల్‌లో ఫార్మా కంపెనీ పెడుతున్నారని, ప్రజల నుంచి తిరుగుబాటు ఎదుర్కొంటున్నారని మండిప‌డ్డారు. తెలంగాణలో ప్రజలను వంచించి ఎన్నికల హామీలు అమలు చేయకుండా మహారాష్ట్ర ఎన్నికల్లో రాహుల్ గాంధీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, తెలంగాణ కాంగ్రెస్ కు ఏటీఎం లాగా మారిందని స్వయంగా ప్రధాని ఆరోపించారని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దీనిపై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. ఆఫీస్ ఆఫ్ ఫ్రాఫిట్ కింద పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 4 వేల కోట్ల పనులు కట్టబెడుతున్నారని, దీనిపై కూడా కేంద్రం విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

మ‌హారాష్ట్ర‌, తెలంగాణ మ‌ధ్య చెక్ పోస్ట్‌
పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిబంధనలు ఉల్లంఘించినందుకు పదవిని కోల్పోవాల్సి వస్తుందని కేటీఆర్ అన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో కేంద్ర ఎన్నికల సంఘం మరిన్ని చెక్ పోస్టులు పెట్టాలని, తెలంగాణ నుంచి మహారాష్ట్ర ఎన్నికలకు డబ్బులు వెళుతున్నాయని ఆరోపించారు. బీజేపీ ఎంపీలు ఒక్కరు కూడా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు నోరు విప్పడం లేదని నిలదీశారు. రేవంత్ రెడ్డి అనుభవరాహిత్యం వల్ల తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు నాలుగు కార్పోరేషన్లుగా విభజించాలని చూస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. అధికార దుర్వినియోగం, అవినీతి నిరోధక చట్టాలను ఉపయోగించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కేటీఆర్ కోరారు. అర్హత లేకపోయినా సీఎం బావమరిది శోధా కంపెనీకి రూ. 1,137 కోట్ల పనులు అప్పగించారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి తన బావమరిదికి కేటాయించిన పనులపై పారదర్శకంగా విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com