Saturday, December 28, 2024

నెక్స్‌ట్‌ వీళ్ళేనా…?

– విడాకులకు సిద్ధంగా ఉన్న జంట
– వేరే రిలేషన్స్‌లో ఉండడం నిజమేనా?
– లేక అత్తా కోడలికి పడడం లేదా?
– కారణాలు ఏమైనప్పటికీ విడిపోవడం గ్యారెంటీనా?
బాలీవుడ్ టాప్‌ కపుల్స్‌లో అభిషేక్‌ ఐశ్వర్యలు ఉన్న విషయం తెలిసిందే. మరి వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్న సంగతి అందరికి తెలిసిందే. 2007లో ఐశ్వర్యరాయ్,అభిషేక్ బచ్చన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది. 16 ఏళ్లు బాగానే సాగిన కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తాము కలిసే ఉన్నామని విడాకులు తీసుకోవడం లేదని ఐశ్వర్యరాయ్ క్లారిటీ ఇస్తూ ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసినప్పటికి ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు. అంబానీ ఇంట జరిగిన పెళ్లి సమయంలో కూడా అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్యరాయ్ విడాకుల ప్రస్తావన తెర మీదకు వచ్చింది. ఫొటో సెషన్‌లో భాగంగా బచ్చన్ ఫ్యామిలీతో కాకుండా ఐశ్వర్యరాయ్ ఒక్కరే ఫొటోలు దిగడంతో మరోసారి ఈ జంట విడాకుల గురించి చర్చ నడిచింది. ఈ ఘటన తర్వాత ఐశ్వర్యరాయ్ కూతురుతో కలిసి ఒంటిరిగా విదేశాలకు వెళ్లడంతో మరోసారి అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్యరాయ్ విడాకులు తెర మీదకు వచ్చాయి. కూతురిలో వీరిద్దరు దుబాయ్ వెకేషన్‌కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి బస్సు ఎక్కుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోతో విడాకుల రూమర్లకు ఈ జంట చెక్ పెట్టినట్టు అయింది. అయితే తాజాగా ఐశ్వర్యరాయ్ తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఆరాధ్య పుట్టిన రోజుకు సంబంధించిన ఫొటోలను ఐశ్వర్యరాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఆరాధ్య బచ్చన్ రీసెంట్‌గా 13వ ఏట అడుగుపెట్టడంతో యువర్ అఫిషియల్లీ టీనేజర్ ఆరాధ్య అంటూ పోస్టర్ పెట్టి మరీ కూతురికి అల్లారు ముద్దుగా ట్రీట్ ఇచ్చింది. ఈ ఫొటోల్లో కూతురు ఆరాధ్య, ఐశ్వర్యరాయ్ మాత్రమే ఉన్నారు. ఈ ఫొటోల్లో ఎక్కడా కూడా అభిషేక్ బచ్చన్ కనిపించలేదు. అభిషేక్ రాకపోయినప్పటికీ తన కుటుంబ సభ్యులతో కూతురు బర్త్ డే వేడుకలను నిర్వహించి భర్తకు గట్టి షాకే ఇచ్చింది. ఇటు బచ్చన్ ఫ్యామిలీ నుంచి కూడా ఎవరూ హాజరుకాలేదు.దీంతో తల్లి మాత్రమే ఉండటంతో ఫ్రేమ్‌లో తండ్రి అభిషేక్ బచ్చన్ మిస్సింగ్ అంటూ కామెంట్స్ షేర్ చేస్తున్నారు.ఐష్-అభిషేక్ విడాకులు కన్ఫామేనా అంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు.గత కొద్దిరోజులుగా అభిషేక్ బచ్చన్ నుంచి ఐష్ విడాకులు తీసుకుంటోందనే పుకార్లు షికారు చేస్తున్నాయి.

కారణాలేమిటంటే…
ఇదే సమయంలో ఐశ్వర్యరాయ్ ఓ వ్యక్తితో క్లోజ్‌గా మూవ్ అవుతోందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఐశ్వర్యరాయ్‌ జిరాక్ మార్కర్ అనే ఓ డాక్టర్‌తో సన్నిహితంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ స్నేహం ప్రస్తుతం వేరే రిలేషన్‌గా మారిందని కొంతమంది బాలీవుడ్ జనాలు చర్చించుకున్నారు. అయితే అతను ఐశ్వర్యరాయ్ చిన్ననాటి స్నేహితుడని ఆమె సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ హీరోయిన్ కారణంగా ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్‌ వైవాహిక జీవితంలో విభేదాలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది.అభిషేక్ బచ్చన్‌ లైఫ్‌లోకి మరో మహిళ రావడం వల్లే వీరి మధ్య గొడవలు జరిగినట్టు తెలుస్తోంది.దస్వి సినిమాలో నటి నిమ్రత్ కౌర్‌తో అభిషేక్ బచ్చన్‌ క్లోజ్‌గా మూవ్ అవుతున్నాడని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీరిద్దరూ రిలేషన్‌షిప్ పెట్టుకున్నారని తెలిసి ఐశ్వర్య గొడవ పెట్టుకుందని అంటున్నారు. ఐశ్వర్యరాయ్‌ జిరాక్ మార్కర్ అనే ఓ డాక్టర్‌తో సన్నిహితంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ స్నేహం ప్రస్తుతం వేరే రిలేషన్‌గా మారిందని కొంతమంది బాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు. ఇక రీసెంట్‌గా ఆ డాక్టర్‌తో కలిసి ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఐశ్వర్య.. ఆయనకు ముద్దులు పెట్టడంతో దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో చాలా వైరల్ అవుతున్నాయి. దీంతో ఐశ్వర్య ఆ డాక్టర్‌తో రిలేషన్‌లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ విడాకులకు కారణం ఆ డాక్టర్ అవుతారని కొంతమంది భావిస్తున్నారు. అయితే జిరాక్ మార్కర్ ఐశ్వర్యరాయ్‌‌కు కాలేజ్ ఫ్రెండ్ అని తెలుస్తోంది. వీరిద్దరు కాలేజ్ డేస్ నుంచి కూడా మంచి ఫ్రెండ్స్‌గా కొనసాగుతున్నారని ఐశ్వర్యరాయ్‌ సన్నిహితులు చెబుతున్నారు. అంతే కానీ వీరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని వారు క్లారిటీ ఇస్తున్నారు. మరి దీనిపై అభిషేక్ ఎలా రియాక్ట్ అవుతాబో చూడాలి. ఏది ఏమైనప్పటికీ సినీ సెలబ్రెటీల రిలేషన్స్‌ చాలా విచిత్రంగా ఉంటాయి. అప్పుడే ప్రేమ..పెళ్ళి.. అప్పుడే విడాకులు బంధాలకి, ఎమోషన్స్‌కి వీళ్ళ/ పెద్దగా విలువివ్వరని సోషలహమీడియాలో మరోపక్క చర్చ జరుగుతుంది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com