Wednesday, January 8, 2025

నేను సెకండ్‌ హ్యాండా?

సిటాడెల్‌ వెబ్‌సిరీస్‌లో భాగంగా సమంత గత కొద్ది రోజులుగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న విషయం తెలిసిందే. తన జీవితంలో జరిగిన అనేక విషయాలపై తరచుగా గుర్తు చేసుకుంటూ కాస్త ఎమోషనల్‌ అవుతున్నారు సామ్‌. విడాకులు తీసుకోవడం.. మయోసైటిస్ బారినపడటం.. వంటి క్లిష్టమైన పరిస్థితుల కోసం సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నారు. తాజాగా మరో ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు సామ్. విడాకుల సమయంలో తనకు సంబంధించిన ఎన్నో అవాస్తవాలు చాలామంది ప్రచారం చేశారని సమంత ఆవేదన వ్యక్తం చేశారు. అవి అబద్ధాలు కాబట్టి వాటి గురించి ఎప్పుడూ మాట్లాడాలని అనుకోలేదని తెలిపారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు కొందరు స్నేహితులు, కుటుంబ సభ్యులు మంచి మద్దతు పలికారని చెప్పారు. విడాకుల సమయంలో తాను చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నానని తెలిపారు. ఓ ఇద్దరి మధ్య రిలేషన్ బ్రేక్ అయితే అనేక మంది అమ్మాయిలనే నిందిస్తారని బాధపడ్డారు. మనం అలాంటి సమాజంలో బతుకుతున్నామని చెప్పారు. ముఖ్యంగా విడాకుల అయిన తర్వాత అమ్మాయిలకు సొసైటీ కొన్ని ట్యాగ్స్ తగిలిస్తుందని సమంత వ్యాఖ్యానించారు. సెకండ్ హ్యాండ్, ఆమె జీవితం వేస్ట్, యూజ్డ్ అని అంటారని తెలిపారు. అలా ఎందుకు చేస్తారో తనకు ఇప్పటికే అర్ధం కావడం లేదని అన్నారు. అలాంటి మాటలు సదరు అమ్మాయి, వాళ్ల ఫ్యామిలీని ఎంతో బాధపడేలా చేస్తాయని చెప్పారు. ఆ తర్వాత తన పెళ్లి గౌను రీమోడల్ చేయించిన విషయంపై మాట్లాడారు. ఆ సమయంలో చాలా బాధపడినట్లు తెలిపారు. మ్యారేజ్ గౌను రీడిజైన్ చేయించి.. తాను రివెంజ్ తీర్చుకోవాలని అనుకోలేదని తెలిపారు సమంత. లైఫ్ లో జరిగిన విషయాలు దాచుకోవాలని అనుకోవడం లేదని చెప్పారు. ఎన్నో కష్టమైన స్టేజీలు దాటుకుని ఇక్కడి వరకు వచ్చానని పేర్కొన్నారు. అది తన స్ట్రెంత్ కు ఒక నిదర్శనమని అన్నారు. ప్రస్తుతం తాను చాలా హ్యాపీగా ఉన్నట్లు వెల్లడించారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com