Thursday, April 17, 2025

ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డికి ఊర‌ట‌

ప్ర‌త్యేక బ్యార‌క్‌.. ఇంటి నుంచి భోజ‌నం
ఆదేశాలిచ్చిన కోర్టు

ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న‌లో కీల‌క సూత్ర‌దారిగా అరెస్టైన కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. చర్లపల్లి జైల్లో ఆయనకు స్పెషల్ బ్యారక్ ఇవ్వాలని జైలు సూపరిండెంట్‌ను హైకోర్టు ఆదేశించింది. తోటి ఖైదీలతో కాకుండా పట్నం నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఇంటికి భోజనానికి కూడా అనుమతిస్తూ ఆదేశాలిచ్చింది. కాగా, నాలుగు రోజుల క్రితం చర్లపల్లి జైలులో తనను ప్రత్యేక బ్యారక్‌లో ఉంచాలంటూ పట్నం నరేందర్‌రెడ్డి హౌజ్‌ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాది కోర్టు రిజిస్ట్రీకి పిటిషన్‌ను సమర్పించారు. మొదట తొలుత పిటిషన్‌ను హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలించి తిరస్కరించారు. తాజాగా నరేందర్‌రెడ్డికి ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని న్యాయస్థానం జైలు సూపరింటెండెంట్‌కు ఆదేశాలిచ్చింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com